IDBI Bank Cautions: ఐడీబీఐ బ్యాంక్ ప్రజలను హెచ్చరిస్తూ కీలక ప్రకటన చేసింది. ఐడీబీఐలో జాబ్ ఆఫర్ల పేరిట ప్రజలను మోసగిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్ చేసింది. ఉద్యోగ నియామకాల కోసం, డబ్బులు వసూలు చేయడం కోసం తాము ఎలాంటి ఏజెన్సీని నియమించలేదని ఐడీబీఐ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఐడీబీఐ బ్యాంక్ యాజమాన్యం ట్వీట్ చేసింది. కొన్ని ఏజెన్సీలు ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగాల పేరిటి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఐడీబీఐ అధికారులు తెలిపారు. అంతేకాదు.. బ్యాంక్ పేరు, లోగోను ఉపయోగించి ఉద్యోగాల పేరుతో అమాయక ప్రజలకు ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తాము ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు గానీ, ఉద్యోగ నియామకాల కోసం ఏజెన్సీలను గానీ ఏర్పాటు చేయలేదని ఐడీబీఐ స్పష్టం చేసింది.
ఎల్ఐసీ నియంత్రిత బ్యాంక్ అయిన ఐడీబీఐ.. తమ బ్యాంకులో సిబ్బంది నియామకానికి, శిక్షణ ఇవ్వడం కోసం డబ్బులు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అబద్ధపు ప్రకనలను నమ్మొద్దని ప్రజలకు సూచించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఏజెన్సీల ఉచ్చులో పడొద్దని, ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన వస్తే ఒకటికి పదిసార్లు వేరిఫై చేసుకోవాలసి ప్రజలకు ఐడీబీఐ హితవుచెప్పింది. తమ బ్యాంక్‌లో ఉద్యోగ నియామకాలు అన్ని పకడ్బందీగా నిర్వహిస్తామన్న ఐడీబీఐ.. నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు అన్నీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే ఐడీబీఐ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ లైవ్ కింది వీడియోలో చూడొచ్చు..
Also read:
రేప్ చేయబోయిన వ్యక్తి… మరెప్పుడు అలాంటి పని చేయకుండా తగిన శాస్తి చేసిన మహిళ