flipkart offer : ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్… వినియోగదారులకు ‘గ్రూపు సేఫ్‌ గార్డ్‌’ను ఆఫర్‌

|

Feb 20, 2021 | 5:27 PM

దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. కస్టమర్లకు గ్రూపు ఇన్సూరెన్స్‌ పాలసీ అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ రెడీ అయ్యింది.

flipkart offer : ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్... వినియోగదారులకు ‘గ్రూపు సేఫ్‌ గార్డ్‌’ను ఆఫర్‌
Follow us on

Flipkart offer hospicash benefit : దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. కస్టమర్లకు గ్రూపు ఇన్సూరెన్స్‌ పాలసీ అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ రెడీ అయ్యింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా యాక్ససిరీస్‌లను కొనుగోలు చేస్తే కేవలం తక్కువ మొత్తం చెల్లించి ఇన్సూరెన్స్ పొందొచ్చని తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ ప్రధాన ప్రత్యర్థి అమెజాన్. అమెజాన్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ క్విక్ పేరుతో ఈ హైపర్ లోకల్ సర్వీసులు ఆఫర్ తీసుకువచ్చిన సంస్థ కస్టమర్ల రక్షణకు శ్రీకారం చుట్టింది.

ఈమేరకు ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఫ్లిప్‌కార్ట్‌ వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ తన కస్టమర్లకు ఐసీఐసీఐ లాంబార్డ్‌కు చెందిన గ్రూపు ఇన్సూరెన్స్‌ పాలసీ ‘గ్రూపు సేఫ్‌ గార్డ్‌’ను ఆఫర్‌ చేయనుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే చికిత్సల వ్యయాలను చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ట్రీట్‌మెంట్ ఖర్చులతో సంబంధం లేకుండా.. ఈ పాలసీలో ప్రతిరోజూ ఎంచుకున్న మేరకు నగదును చెల్లించాల్సి ఉంటుందని ఇరు కంపెనీలు ఉమ్మడిగా ఓ ప్రకటనలో తెలిపాయి.

గ్రూపు సేఫ్‌ గార్డ్‌ పాలసీలో హాస్పిక్యాష్‌ బెనిఫిట్‌ కింద ప్రతిరోజూ కనీసం రూ.500 నుంచి గరిష్టంగా ఎంచుకున్న మేరకు పరిహారాన్ని పాలసీదారులు పొందడానికి వీలుంటుంది. తక్కువ ధరలకే, కాగిత రహిత, సౌకర్యవంతమైన పాలసీ అందిస్తున్నట్లు ఇరు కంపెనీల ప్రతినిధులు సంయుక్తంగా తెలియజేశారు. ఈ పాలసీ ద్వారా ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరినా లేదా ముందుగా నిర్దేశించుకున్న మేర చికిత్సల కోసం ఆస్పత్రిలో చేరినా నగదు ప్రయోజనాన్ని పొందొచ్చని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also…  Viral: తినే రోటీలపై ఉమ్మి వేస్తున్న యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు