ICICI Bank FD: సీనియర్ సిటిజనులకు ‘గోల్డెన్’ అవకాశం.. మరో మూడు రోజులే సమయం.. త్వరపడండి..

|

Apr 04, 2023 | 12:59 PM

ఐసీఐసీఐ బ్యాంక్ కొన్నేళ్లుగా అద్భుతమైన ఎఫ్‌డీని ఆఫర్ చేస్తోంది. అత్యధిక వడ్డీతో పాటు అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది. ఆ పథకం పేరు ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ). ఇది సీనియర్ సిటిజెన్స్ ప్రత్యేకించిన పథకం.

ICICI Bank FD: సీనియర్ సిటిజనులకు ‘గోల్డెన్’ అవకాశం.. మరో మూడు రోజులే సమయం.. త్వరపడండి..
Icici Bank
Follow us on

సురక్షిత పెట్టుబడి పథకాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‪డీ) ఒకటి. ఇది విశేషమైన ప్రజాదరణ పొందింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీసుల్లోనూ ఈ ఫిక్స్‪డ్ డిపాజిట్ ఖాతాలను ప్రారంభించవచ్చు. ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన ఐసీఐసీఐ కొన్నేళ్లుగా అద్భుతమైన ఎఫ్‌డీ ఆఫర్ ను అందిస్తోంది. అత్యధిక వడ్డీతో పాటు అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది. ఆ పథకం పేరు ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ). ఇది సీనియర్ సిటిజెన్స్ ప్రత్యేకించిన పథకం. అత్యధికశాతం వడ్డీ దీనిపై బ్యాంకు అందిస్తోంది. ఐదళ్ల నుంచి 10 ఏళ్ల వరకూ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అయితే ఈ అద్భుతమైన స్కీమ్ కి డెడ్ లైన్ దగ్గర పడింది. 2023, ఏప్రిల్ 7 తేదీ నుంచి బ్యాంకు ఈ గోల్డెన్ ఎఫ్ డీ పథకాన్ని నిలిపివేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ పథకం ఏంటి? దీని ప్రయోజనాలు ఎలా ఉంటాయి? ఎవరు అర్హులు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది పథకం..

ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం అయిన ఐసీఐసీఐ భారతదేశంలో నివిసించే సీనియర్ సిటిజెనులకు ప్రత్యేకించి ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్ డీ ని 2020, మే 21న ప్రారంభించింది. ఇప్పుడు ఈ పథకాన్ని ముగించే సమయం ఆసన్నమైంది. 2023, ఏప్రిల్ 7న ఈ పథకాన్ని క్లోజ్ చేయనున్నట్లు బ్యాంకు ప్రకటించింది. దీనిలో ఖాతా ఓపెన్ చేసిన వారు రూ. 2 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టవచ్చు. కాల వ్యవధి ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల వరకూ ఉంటుంది. దీనిపై 7.5 శాతం వడ్డీని బ్యాంకు అందిస్తోంది. ఇది సాధారణ ఎఫ్ డీ రేటు 6.9 శాతం కన్నా 60 బేస్ పాయింట్లు అధికం.

ఖతా ఎలా ఓపెన్ చేయాలి..

కేవలం కొన్ని నిమిషాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ ఖాతాని వినియోగదారులు తెరవవచ్చు. అందుకోసం వినియోగదారులు బ్యాంక్ ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ సిస్టమ్‌లను ఉపయోగించవచ్చు లేదా బ్యాంక్ బ్రాంచ్‌ లో సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రీమెచ్యూర్ విత్ డ్రాల్..

ఐసీఐసీఐ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న దాని ప్రకారం ఈ పథకం కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ప్రారంభించి, టెన్యూర్ ముగియకుండానే నగదు తీసుకొనే వెసులుబాటు బ్యాంకు కల్పించింది. అందుకు కేవలం 1శాతం మాత్రమే జరిమానా కింద బ్యాంకు తీసుకొని ప్రీ మెచ్యూర్ విత్ డ్రాల్ కి అనుమతి
ఇస్తుంది.

అదనపు ప్రయోజనాలు.. ఇంకా ఖాతాపై బ్యాంకు క్రెడిట్ కార్డు కూడా అందిస్తుంది. రుణ సదుపాయం కూడా ఈ ఎఫ్ డీ ఖాతాపై తీసుకొనే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..