ICICI Bank: ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లకు పెద్ద అలర్ట్ జారీ చేసింది బ్యాంకు. కోట్లాది మంది ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులు రెండు రోజుల పాటు బ్యాంకు సేవలను వినియోగించుకోలేరు. ఈ విషయాన్ని బ్యాంక్ ఇప్పటికే తన ఖాతాదారులందరికీ తెలియజేసింది. ICICI బ్యాంక్ డిసెంబర్ 14, 2024 రాత్రి 11:55 నుండి డిసెంబర్ 15, 2024 ఉదయం 6:00 గంటల వరకు బ్యాంక్‌లో ప్రీ-షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ వర్క్‌ను నిర్వహిస్తుంది. ఈ సమయంలో బ్యాంక్ RTGS అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సర్వీస్ ప్రభావితం అవుతుంది. ఈ కాలంలో బ్యాంక్ కస్టమర్లు RTGS సేవను ఉపయోగించలేరు.
ICICI బ్యాంక్ కస్టమర్లు ఈ సమయంలో NEFT, IMPS, UPI సేవలను iMobile యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించవచ్చు.
RTGS అనేది ఎలక్ట్రానిక్ లావాదేవీల బదిలీ పద్ధతి. ఇది బ్యాంకు ఖాతాల మధ్య చెల్లింపులను తక్షణ పరిష్కారాన్ని అందిస్తుంది.
ఇది కూడా చదవండి: Christmas Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో క్రిస్మస్ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి