Customer Charges Hike: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఛార్జీలు పెంచింది. నేటి నుంచి (ఫిబ్రవరి 10) పెరిగిన సర్వీసు, లేటు చెల్లింపులపై విధించే ఛార్జీలు.. అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తమ ఖాతాదారులకు తెలియజేసింది. ఇకపై క్రెడిట్ కార్డు వినియోగదారులు వాడుతున్న కార్డులపై ఇక నుంచి కనీసం రూ. 500 లపై.. 2.5 శాతం ట్రాన్సాక్షన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. క్యాష్ అడ్వాన్సెస్(అవసరానికి క్రెడిట్ కార్డు నుంచి డబ్బు తీసుకోవడం)కు కూడా ఇదే రేటు వర్తిస్తుందని తెలిపింది. లేట్ పేమెంట్ ఛార్జీలను కూడా ఐసీఐసీఐ పెంచేసింది. బ్యాంకుకు సంబంధించిన ఎమరాల్డ్ క్రెడిట్ కార్డు మినహా మిగిలిన అన్ని రకాల క్రెడిట్కార్డులకు ఈ రూల్స్ వర్తిస్తాయని వెల్లడించింది.
క్రెడిట్ కార్డు బిల్లును బట్టి లేట్ పేమెంట్ ఛార్జీలు మారుతూ ఉంటాయి. బిల్లు రూ. 100 లోపు ఉంటే.. ఎలాంటి ఛార్జీ చెల్లించనక్కర్లేదు. గరిష్ఠంగా విధించే లేట్ పేమెంట్ ఛార్జీ రూ. 1,200 వరకు ఉంటుందని బ్యాంకు నిర్ణయించింది. క్రెడిట్ కార్డుపై వినియోగదారుడు చెల్లించాల్సిన మెుత్తం రూ. 50 వేల కంటే ఎక్కువ ఉంటే ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. డ్యూ డేట్ నాటికి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక పోతే.. బ్యాంకు అధనంగా ఛార్జీలు వేయకుండా ఉండాలంటే.. కస్టమర్లు పేమెంట్ ఔట్ స్టాండింగ్ ఉన్నప్పుడు తమ క్రెడిట్ కార్డును వినియోగించకుండా ఉంటే ఉత్తమం.
ఇవీ చదవండి..
Digital Rupee: డిజిటల్ రూపీ ఎలా పనిచేస్తుంది..? పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం..
e-RUPI: డిజిటల్ చెల్లింపులకు ఆర్బీఐ ఊరట.. ఆ లిమిట్ రూ. లక్ష వరకు పెంచుతూ నిర్ణయం..