కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందిస్తున్న ICICI బ్యాంక్.. వారి కోసం ‘పే లేటర్’ అందుబాటులోకి.. ఎలాగో తెలుసా..

|

Feb 23, 2021 | 1:12 PM

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. సరికొత్త ఆఫర్లను తీసుకువస్తూ.

కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందిస్తున్న ICICI బ్యాంక్.. వారి కోసం పే లేటర్ అందుబాటులోకి.. ఎలాగో తెలుసా..
Follow us on

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. సరికొత్త ఆఫర్లను తీసుకువస్తూ.. తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే ఐసీఐసీఐ తాజాగా ‘బై నౌ పే లేటర్’ అనే ఆఫర్ అందిస్తోంది. ఈ సర్వీసులను ఐసీఐసీఐ పేలేటర్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో కస్టమర్లు తమ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏవైనా ప్రొడక్ట్ కొన్నాక.. మనీ తర్వాత కట్టొచ్చు. ఈ ఆఫర్ ద్వారా ప్రొడక్టులు కొంటే.. తర్వాతి నెల 15 తేదీలోగా వారు ఉపయోగించిన డబ్బులు కాట్టాల్సి ఉంటుంది. 45 రోజుల వరకు వడ్డీ రహిత కాలం లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఐసీఐసీఐ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా ఐమొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా ఈ బెనిఫిట్ పొందొచ్చు.

ఇవేకాకుండా.. ఐసీఐసీఐ పాకెట్స్ యాప్, బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఆఫర్ అందుకోవచ్చు. ఇక మీరు ఈ సర్వీసులు యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీ పేరుపై పే లేటర్ అకౌంట్ నెంబర్ క్రియేట్ అవుతుంది. పే లేటర్ సర్వీసుల ద్వారా నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేయ్యొచ్చు. ఆన్ లైన్ మార్కెట్స్ అయిన అమెజాన్, పేటీఎం, మెబిక్విక్, ఫ్లిప్ కార్ట్, ఫోన్ పే వంటి వాటి ద్వారా చెల్లింపులు జరుపవచ్చు. కానీ ఐసీఐసీఐ పే లేటర్ ద్వారా కేవలం షాపింగ్ మాత్రమే చేయడానికి వీలుంది. ఇతరుల బ్యాంక్ ఖాతాకు మీరు డబ్బులు పంపించడానికి వీలులేదు. కేవలం షాపింగ్ చేయడానికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే మీకు ఎంత లిమిట్ వస్తుందనేది బ్యాంక్ నిర్ణయిస్తుంది. ‘

Also Read: ఐసీఐసీఐ మొబైల్ యాప్‏లో కీలక మార్పు.. ఇతర బ్యాంకుల కస్టమర్లకు ఇకపై అందుబాటులోకి..