IBM: 15 ఏళ్లుగా సెలవులో ఉన్న ఉద్యోగి.. జీతం పెంచడం లేదని కంపెనీపై దావా.. విచిత్రమైన కేసు గురించి తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌

IBM IT Employee: ఓ ఉద్యోగి అనారోగ్యం కారణంగా ఏకంగా 15 సంవత్సరాల పాటు సెలవు పెట్టేశాడు. అయినా ప్రతి సంవత్సరం జీతం పొందుతూనే ఉన్నాడు. అయితే దాదాపు ఐదు సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఉన్న తర్వాత ఇయాన్ 2013లో కంపెనీపై ఫిర్యాదు చేశాడు..

IBM: 15 ఏళ్లుగా సెలవులో ఉన్న ఉద్యోగి.. జీతం పెంచడం లేదని కంపెనీపై దావా.. విచిత్రమైన కేసు గురించి తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌
Ibm It Employee

Updated on: Jan 27, 2026 | 9:44 AM

IBM IT Employee: సాధారణంగా ఏదైనా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏదైనా ఆనారోగ్యం సంభవిస్తే సెలవులు తీసుకుంటాము. మరి అయితే నెల, రెండు నెలలు, మూడు నెలలు. ఇలా కంపెనీలను బట్టి వెసులుబాటు ఉంటుంది. మరి సంవత్సరాలుగా సెలవులు తీసుకుంటే జాబ్‌లోంచి తీసేస్తుంటాయి కంపెనీలు. కానీ ఇక్కడ ఓ ఉద్యోగి అనారోగ్యం కారణంగా ఏకంగా 15 సంవత్సరాల పాటు సెలవు పెట్టేశాడు. అయినా ప్రతి సంవత్సరం జీతం పొందుతూనే ఉన్నాడు. ఒక UK IT ఉద్యోగికి ఇది కూడా సరిపోలేదు. తన జీతం పెరగనందున అతను కంపెనీపై దావా వేశాడు.

ఇది ఒక దిగ్గజ టెక్ కంపెనీ అయిన IBM, దాని ఉద్యోగి ఇయాన్ క్లిఫోర్డ్ ప్రత్యేకమైన కేసు. ఇది ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. క్లిఫోర్డ్ IBM UKలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. సెప్టెంబర్ 2008లో అతను మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా వైద్య సెలవు తీసుకున్నాడు. మొదట్లో అతను కొంతకాలం తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరుతాడని భావించారు. కానీ అతని అనారోగ్యం మరింత తీవ్రమైంది. సమయం గడిచిపోయింది. అలాగే ఇయాన్ ఎప్పుడూ కార్యాలయానికి తిరిగి రాలేదు. దీంతో అతను సెలవుల్లో ఉండిపోయాడు.

ఇది కూడా చదవండి: Bank Strike: నేడు బ్యాంకులు బంద్‌.. దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం

ఇవి కూడా చదవండి

5 సంవత్సరాల తర్వాత లేవనెత్తిన ప్రశ్న:

దాదాపు ఐదు సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఉన్న తర్వాత ఇయాన్ 2013లో కంపెనీపై ఫిర్యాదు చేశాడు. తన జీతం ఒక్కసారి కూడా పెంచలేదని, అంటే తనకు ఎటువంటి ఇంక్రిమెంట్లు రాలేదని అతను పేర్కొన్నాడు. 2013లో రెండు పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చారు. IBM తన ప్రత్యేక అనారోగ్యం, ప్రమాద బీమాలో భాగంగా ఇయాన్‌ను చేర్చారు. దీని ప్రకారం అతను పనిచేసినా, చేయకపోయినా, అతను 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఏటా తన చివరి జీతంలో 75% పొందాలని నిర్దేశించింది.

ఆ సమయంలో అతను సంవత్సరానికి సుమారు 54,000 పౌండ్లు (సుమారు 5.4 మిలియన్ రూపాయలు) పొందవలసి ఉంది. మీడియా నివేదికల ప్రకారం, అతను పదవీ విరమణ చేసే సమయానికి 150 మిలియన్లకు పైగా పొందేవాడు. ఇంకా, కొన్ని పాత సెలవు క్లెయిమ్‌లకు అతనికి అదనపు పరిహారం కూడా అందించారు. ప్రతిగా ఇయాన్ కేసును పరిష్కరించడానికి అంగీకరించాడు.

పదేళ్ల తర్వాత మళ్లీ కేసు

కథ అక్కడితో ముగిసిపోవాల్సింది. కానీ అది జరగలేదు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత, 2022లో ఇయాన్ మళ్ళీ IBMపై దావా వేశాడు. ఉపాధి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. ఈసారి ఆరోపణ వైకల్య వివక్షత. 2013 నుండి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా తన వార్షిక జీతం పెంచలేదని అతను వాదించాడు. ధరలు పెరుగుతున్నాయి, కానీ అతని ఆదాయం అలాగే ఉందని పేర్కొన్నాడు. అతని ఆదాయం వాస్తవ విలువను క్షీణింపజేస్తోంది.

Auto News: ఈ బైక్‌ ధర కేవలం రూ.74 వేలే.. మైలేజీ 70 కి.మీ.. మార్కెట్‌ను షేక్‌ చేస్తున్న బైక్‌!

కోర్టు ఏం చెప్పింది?

2023లో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం, క్లిఫోర్డ్ వాదనను, డిమాండ్‌ను తిరస్కరించింది. మీ కోసం కల్పించిన ప్రత్యేక ప్రయోజనంతో పాటు అదనపు ప్రయోజనాలను పొందనందుకు , వివక్ష జరిగిందని ఆరోపించారని కేసును కొట్టివేసింది. అందుకే క్లిఫోర్డ్ డిమాండ్‌లో న్యాయం లేదని తీర్పు చెప్పింది. IBM అందించే జీవితకాల భత్యం ఒక ముఖ్యమైన ప్రయోజనం అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ ప్రయోజనం అందరికి ఉండదు. ఇతర సాధారణ ఉద్యోగులు అలాంటి ప్రయోజనాలకు అర్హులు కారు అని పేర్కొన్నారు. ప్రత్యేక హక్కు పొందిన తర్వాత అదనపు ప్రయోజనాలను డిమాండ్ చేయడాన్ని వివక్షగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Indian Railways: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ మార్గంలో ఫిబ్రవరి 14 వరకు అనేక రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి