Hyundai car: సరికొత్త లుక్ లో హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, అత్యాధునిక ఫీచర్లతో.. ప్రీ బుకింగ్స్ ప్రారంభం..
ఇప్పటికే ఈ కారు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. అధీకృత హ్యూందాయ్ డీలర్ల వద్ద రూ.11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి కారును ప్రీబుక్ చేసుకోవచ్చు. ఇంతకు ముందున్న మోడల్ తో పోల్చుకుంటే గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ మరింత అప్ గ్రేడెడ్ వెర్షన్లో వస్తోంది.

హ్యూందాయ్ నుంచి మరో కారు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్ లిఫ్ట్ పేరిట భారతదేశంలో అడుగు పెట్టనుంది. ఇప్పటికే ఈ కారు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. అధీకృత హ్యూందాయ్ డీలర్ల వద్ద రూ.11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి కారును ప్రీబుక్ చేసుకోవచ్చు. ఇంతకు ముందున్న మోడల్ తో పోల్చుకుంటే గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ మరింత అప్ గ్రేడెడ్ వెర్షన్లో వస్తోంది. ఈ కారు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అత్యాధునిక ఫీచర్లు..
హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్ లిఫ్ట్ కారులో క్రూయిజ్ కంట్రోల్, ఎల్ఈడీ టైలాంప్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (హైలైన్), ఈఎస్సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC) వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో సేఫ్టీకి కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. కస్టమర్ నిర్ణయాన్ని బట్టి మరో రెండు ఎయిర్ బ్యాగ్ లను కూడా అందిస్తారు. ఈ కారు వినియోగదారులకు భద్రతతో పాటు మరింత సౌకర్యంతో కూడిన ప్రయాణాన్ని అందిస్తుంది.
మూడు పవర్ ట్రైన్స్..
కొత్త గ్రాండ్ i10 నియోస్ ఫేస్ లిఫ్ట్ కారు వినియోగదారులకు మూడు పవర్ సామర్థ్యాలను అందిస్తోంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 1.2 l కప్పా పెట్రోల్, స్మార్ట్ ఆటో AMTతో 1.2 l కప్పా పెట్రోల్, 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 1.2 l కప్పా పెట్రోల్ + సీఎన్జీ రకాలలో లభ్యమవుతోంది. ఆరు మోనోటోన్ కలర్ ఆప్షన్‌లతో కారు అందుబాటులో ఉంది. పోలార్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, స్పార్క్ గ్రీన్ (న్యూ ఎక్స్‌క్లూజివ్), టీల్ బ్లూ, ఫైరీ రెడ్ వంటి రంగుల్లో కారు అభ్యమవుతుంది. అలాగే డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్పార్క్ గ్రీన్ (కొత్త) బ్లాక్ రూఫ్‌తో, పోలార్ వైట్‌తో బ్లాక్ రూఫ్.
ఫీచర్లు సూపర్..
ఈ కారు స్టైలిష్ R15 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. వెనుక భాగంలో కొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ డిజైన్ ఉంటుంది. క్యాబిన్ లోపల, హ్యాచ్‌బ్యాక్ యూఎస్బీ టైప్-సి ఛార్జర్, స్మార్ట్ ఫోన్ నావిగేషన్‌తో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఆడియో, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్‌తో కూడిన స్మార్ట్‌కీ, పూర్తి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ (FATC), యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ను అందిస్తుంది. వాయిస్ రికగ్నిషన్, వెనుక AC వెంట్లతో పాటు ఆటో సపోర్ట్ వంటి సాంకేతిక అంశాలను దీనిలో జోడించారు.
ఆధునిక సాంకేతికతతో..
కొత్త గ్రాండ్ i10 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్ విత్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, రియర్ కెమెరాతో ఆడియోలో డిస్‌ప్లే వంటి 30కి పైగా భద్రతా ఫీచర్లతో వస్తుంది. కొత్త గ్రాండ్ i10 NIOS టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ – హైలైన్ కోసం మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, డిస్‌ప్లేతో 3.5-అంగుళాల స్పీడోమీటర్‌ను కూడా కలిగి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..







