
Post office: ఇండియన్ పోస్టల్ సర్వీస్ తన వినియోగదారుల కోసం రకరకాల సదుపాయలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఒకప్పుడు కేవలం ఉత్తరాలకే పరిమితం అయిన పోస్టాఫీసులు.. ఇప్పుడు రకరకాల సేవలను అందబాటులోకి తీసుకువచ్చాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అడుగులు వేస్తోంది కేంద్రం. ఇప్పుడు మరో సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. పోస్టాఫీసు సర్వీసులను ఎక్కువగా వినియోగించే వారికి అది ఎంతగానే ఉపయోగపడనుంది. పోస్ట్ ఆఫీసు ద్వారా అత్యవసరంగా ఏదైనా పంపాల్సిన వారికి ఎంతో ఉపశమనం కలుగనుంది. హైదరాబాద్ లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జీపీఓలో స్పీడ్ పోస్ట్ బుకింగ్ కోసం 24×7 నైట్ షిఫ్ట్ (Night Shift) సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇది కూడా చదవండి: BSNL Diwali Offer: కేవలం 1 రూపాయికే రోజుకు 2GB డేటా.. 30 రోజుల చెల్లుబాటు!
స్పీడ్ పోస్ట్ బుకింగ్ సేవలు:
సాధారణంగా పోస్ట్ ఆఫీసులు సాయంత్రం కాగానే మూసివేస్తారు. అందుకే టైమింగ్ అప్పటి వరకు మాత్రమే. అప్పుడు ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవు. ఏదైనా అత్యవసరం పంపాల్సి వస్తే మరుసటి రోజు వరకు ఆగాల్సిందే. ఇలాంటి సమస్యకు చెక్ పెడుతూ.. హైదరాబాద్ జీపీఓ నిరంతరాయంగా సేవలు అందించాలని నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 29 వరకు పాఠశాలలు బంద్.. కారణం ఏంటంటే..
ఇకపై స్పీడ్ పోస్ట్ ఉత్తరాలను రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ అదనపు సౌకర్యం వల్ల కస్టమర్లు పగటి వేళలో కౌంటర్ల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ బుకింగ్ ద్వారా రాత్రి సమయంలో బుక్ చేసిన తపాలా (Mail) కూడా నిరంతరాయంగా రవాణాకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా వాణిజ్య సంస్థలకు , డాక్యుమెంట్లు అత్యవసరంగా పంపాల్సిన వారికి ఇది బెనిఫిట్.
హైదరాబాద్ జీపీఓ సేవలు:
పోస్టల్ సర్వీసుల్లో వేగం, భద్రత ముఖ్యమైన అంశాలు. హైదరాబాద్ జీపీఓ ఎప్పుడూ ప్రధాన పోస్టల్ కేంద్రంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతకుముందు జీపీఓలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే బుకింగ్ సేవలు అందుబాటులో ఉండేది. ఈ సమయంలో రిజిస్టర్డ్ పోస్ట్,), పార్సిల్ సేవలు , మనీ ఆర్డర్లు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సేవలు వంటివి అందించేవారు. కొన్ని ప్రత్యేక కౌంటర్లు మాత్రమే కొద్దిసేపు అదనంగా పనిచేసేవి. కాని ఇప్పుడు 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌లో 5 చౌకైన రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ధరల్లో ఎక్కువ వ్యాలిడిటీ!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి