Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మరో భారీ ఫ్లైఓవర్ ప్రారంభానికి రెడీ.. ఈ రూట్లోనే..

హైదరాబాద్ వాసులకు మరో తీపికబురు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. అదే బాచుపల్లి ఫ్లైఓవర్. ఇప్పటికే పనులన్నీ పూర్తవ్వగా.. త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరగ్గా.. దాదాపు రూ.90 కోట్లు ఖర్చు పెట్టారు.

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మరో భారీ ఫ్లైఓవర్ ప్రారంభానికి రెడీ.. ఈ రూట్లోనే..
Bachupally Flyover

Updated on: Jun 03, 2026 | 3:12 PM

హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూ్స్. నగరంలో మరో ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్దమైంది. మియాపూర్-గండిమైసమ్మ కారిడార్‌లో బాచుపల్లి ఎక్స్‌రోడ్ వద్ద నిర్మించిన నూతన ఫ్లైఓవర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రంగులు వేయడం, లైటింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు లాంటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పనులు కొద్ది రోజుల్లోనే పూర్తి కానుండగా.. అనంతరం ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ ప్రారంభించాలని హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్ వైపు వెళ్లే ఉద్యోగులు, ప్రజలకు ట్రాఫిక్ రద్ద అవస్థలు తగ్గనున్నాయి. అలాగే సిగ్నల్ ఫ్రీ జర్నీ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు వేగంగా ప్రయాణం చేయవచ్చు. నాలుగు లైన్లుగా ఈ ఫ్లైఓవర్ నిర్మించారు.

రూ.65.693 కోట్ల ఖర్చు

బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి దాదాపు హెచ్‌ఎండీఏ అధికారులు రూ.65.63 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఫ్లైఓవర్ వల్ల బాచుపల్లి చౌరస్తాలో పూర్తిగా ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. దీని వల్ల మియాపూర్ నుంచి నిజాంపేట, ప్రగతి నగర్, గండిమైసమ్మ వైపు వెళ్లేవారిక సమయం ఆదా కానుంది. దాదాపు 20 నిమిషాల జర్నీ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ వంతెన ఉపయోగపడుతుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీని నిర్మాణం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని డిజైన్ చేసినట్లు హెచ్ఎండీఏ తెలిపింది. ప్రస్తుతం ఐటీ కారిడార్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంతో పాటు సాయంత్రం ఆఫీసుల నుంచి వచ్చే సమయంలో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. చాబుపల్లి కూడలి వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి సిగ్నల్ పడితే కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హెచ్‌ఎండీఏ ఈ ఫ్లైఓవర్ నిర్మించింది.

ఎన్ని కిలోమీటర్లు అంటే..

బాచుపల్లి ఫ్లైఓవర్ మొత్తం పొడవు 1.3 కిలోమీటర్లుగా ఉంది. అలాగే వెడల్పు 17.5 మీటర్లుగా ఉంది. వయాడక్ట్ భాగం 545 మీటర్లతో ఉంటుంది. నాలుగు లైన్ల ఫ్లైఓవర్‌గా దీనిని నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్‌లో సాఫీగా ప్రయాణించవచ్చు. ఎటువంటి ట్రాఫిక్ రద్దీ లేని ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

 

Follow Us