Amazon Republic Day Sale 2021: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ పేరుతో వినియోగదారులకు కల్లు చెదిరే ఆఫర్లు ఇచ్చింది. ఈ ఆఫర్లలో భాగంగా వివిధ కంపెనీలకు చెందిన ప్రోడక్ట్స్‌పై భారీగా రాయితీలు ఇచ్చింది. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ ఈనెల 20 నుంచి ప్రారంభమై 23న ముగియనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రం ఈ ఆఫర్ 19వ తేదీ అర్థరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది.
కాగా, ఈ సేల్‌లో ముఖ్యంగా లేటేస్ట్ ఫోన్లు అయిన వన్‌ప్లస్ 8టి, శాంసంగ్ గెలాక్సీ ఎం51, ఐఫోన్ 12 మినీ, శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్, నోకియా 5.3, ఒప్పో ఏ31 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వీటితోపాటు.. రెడ్‌మి నోట్ 9 ప్రొ మ్యాక్స్, వివో వై30, వివో వి20 వంటి ఫోన్లపైనా అదిరిపోయే డిస్కౌంట్లు ఇవ్వడంతో పాటు.. ఎక్సేంజ్ ఆవకాశాన్ని కూడా కల్పించింది. మొబైల్ ఫోన్ల యాక్సెసరీలపై 40 శాతం వరకు రాయితీలు ఇస్తోంది. ఇక ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ తన ప్రకటనలో పేర్కొంది.
‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ సమయంలో వన్‌ప్లస్ 8టీ కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 2,500 డిస్కౌంట్ కూపన్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. అలాగే ఎంఐ 10 మోడల్‌పై రూ.5 వేల వరకు డిస్కౌంట్ కూపన్ ఇస్తోంది. ఇక ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఐఫోన్ మినీని కొనుగోలు చేసే వినియోగదారులకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కింద రూ.4,500 తగ్గిస్తోంది. ప్రస్తుతం ఐఫోన్ మినీ ధర రూ. 67,900 కాగా, ఈ ఆఫర్‌తో 59,990కే లభించనుంది. ఇక గెలాక్సీ ఎం21, గెలాక్సీ ఎం21 ఎస్, నొకియా 5.3, ఒప్పో ఏ31 మొబైల్ ఫోన్లను చాలా తక్కవ ధరకే అమెజాన్ అందిస్తోంది.
Also read:
Assassination: మైసూరులో దారుణం.. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరకు ఇలా చేశాడు..