Policy Loan: ఈ రోజుల్లో బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. బీమా పాలసీలతో పాటు ఇతర ఇన్వెస్ట్‌మెంట్ పాలసీలు కూడా చాలా మంది తీసుకుంటున్నారు. బ్యాంకులు, ఫైనాన్సియల్ కంపెనీల మాదిరిగానే బీమా పాలసీలపై కూడా రుణం పొందవచ్చు. మీరు ఇన్సూరెన్స్ పాలసీలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల దానిపై మీరు రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఒక రకమైన వ్యక్తిగత రుణం. కంపెనీలు తమ కస్టమర్లకు తిరిగి చెల్లించడం కోసం డిస్కౌంట్లను అందిస్తాయి. మీరు నిర్ణీత వ్యవధి కంటే ముందే రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించాలనుకుంటే, మీరు దానిని తిరిగి చెల్లించవచ్చు. దీనికి అధిక రుసుము విధించే నిబంధన లేదు. అయితే ఇక్కడ పెద్ద సమస్య వడ్డీ రేటు. బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలతో పోలిస్తే బీమా లోన్ వడ్డీ రేటు ఖరీదైనది. బీమా కంపెనీలు ఎక్కువ వడ్డీ వసూలు చేయడమే ఇందుకు కారణం.
అయితే, బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలతో పోలిస్తే ఎక్కువ డబ్బును లోన్ రూపంలో తీసుకోవచ్చు. 25 కోట్ల వరకు కూడా రుణం తీసుకునే వెలుసుబాటు ఉంటుంది. రుణం తీసుకునే అర్హత విషయానికొస్తే, బీమా కంపెనీలు ఈ విషయంలో సడలింపు ఇస్తాయి. ఇతర లోన్‌లతో పోలిస్తే ఎక్కువ డాక్యుమెంట్‌లు అవసరమయ్యే చోట, బీమా రుణానికి అతి తక్కువ సంఖ్యలో డాక్యుమెంట్‌లు అవసరం ఉంటుంది.
కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్టంగా 70 ఏళ్ల వ్యక్తి బీమాపై రుణం తీసుకోవచ్చు. జీతం లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తి ఈ లోన్ తీసుకోవచ్చు. రూ. 3,00,000 వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి బీమా రుణం తీసుకోవచ్చు. దీని కోసం రుణదాత సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. రుణ మొత్తాన్ని 15-20 సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు.
మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం సరైందేనా అని బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీని అడగడం ఉత్తమం. అక్కడి నుంచి వచ్చే సమాధానాల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. వాస్తవానికి బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీలు మీ బీమా పాలసీ ప్రకారం రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. దీని తర్వాత మీరు బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీలకు బీమా పత్రాన్ని సమర్పించాలి. దీని ఆధారంగా మీరు రుణాన్ని పొందుతారు. పాలసీపై రుణం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత 3-4 రోజుల్లో రుణ డబ్బు విడుదల చేస్తారు.
బీమా పాలసీకి లోన్ పొందడానికి మీరు తప్పనిసరిగా అడ్రస్ ప్రూఫ్, ID ప్రూఫ్, ఇన్సూరెన్స్ పాలసీ పేపర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, కేవైసీ డాక్యుమెంట్‌లను కలిగి ఉండాలి. రుణ చెల్లింపు వ్యవధి రుణదాతపై ఆధారపడి ఉంటుంది. తదనుగుణంగా వడ్డీ రేటు కూడా నిర్ణయించబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి