UPI Payments: ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా?

మామూలుగా యూపీఐ పేమెంట్స్ చేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే. ఒకవేళ ఎప్పుడైనా ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయినా లేదా మొబైల్ డేటా అయిపోయినా.. అప్పుడు కూడా పేమెంట్స్ చేసేందుకు ఆప్షన్ ఉందని మీకు తెలుసా? డయల్ సర్వీస్ ద్వారా ఆఫ్‌లైన్ లో కూడా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

UPI Payments: ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా?
Upi Payments

Updated on: Oct 06, 2025 | 5:21 PM

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి. ఒకవేళ ఇంటర్నెట్ లేనప్పుడు అత్యవసరంగా పేమెంట్స్ చేయాలంటే ఆఫ్ లైన్ విధానంలో చేయొచ్చు. దీనికోసం కొన్ని ప్రత్యేకమైన డయల్ కోడ్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డయలర్ కోడ్స్

ఆఫ్‌లైన్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడం కోసం మొబైలో *99# డయల్ చేయడం ద్వారా ఆఫ్‌లైన్ బ్యాంకింగ్ సేవల యాక్సెస్‌ను పొందొచ్చు. యూజర్ రిక్వెస్ట్ మేరకు డబ్బు పంపడానికి, యూపీఐ పిన్ మార్చుకోవడానికి, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఈ కోడ్ ఉపయోగపడుతుంది. *99# సర్వీసుతో దేశంలోని 83 లీడింగ్ బ్యాంకులు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఈ డయల్ సర్వీస్.. 13 భాషల్లో అందుబాటులో ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా..

  • ఆఫ్‌లైన్ యూపీఐ పేమెంట్స్ కోసం రిజిస్టర్ చేసుకోడానికి ముందుగా  బ్యాంకుతో రిజిస్టర్ అయ్యి ఉన్న మొబైల్ నుంచి *99# డయల్ చేయాలి. తర్వాతి ఆప్షన్‌లో కావాల్సిన భాషను ఎంచుకోవాలి.
  • ఇప్పుడు మీ బ్యాంకు పేరు ఎంటర్ చేస్తే.. మొబైల్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్స్ జాబితాను చూపిస్తుంది. ఇప్పుడు వాటిల్లో ఒకటి ఎంచుకోవాలి.
  • తర్వాత సంబంధిత బ్యాంకు డెబిట్ కార్డు చివరి ఆరు అంకెలు, ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయాలి.
  • ఇలా చేయడం ద్వారా ఆఫ్‌లైన్ యూపీఐ సర్వీసులకు మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ అవుతుంది. ఇకపై ఎప్పుడైనా మీరు ఆఫ్‌లైన్ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు.

పేమెంట్స్ ప్రాసెస్ ఇలా..

  • బ్యాంకుతో రిజిష్టర్ అయ్యి ఉన్న మొబైల్ నుంచి *99# డయల్ చేయాలి.
  • పేమెంట్ సెండ్ చేసేందుకు1 ఎంటర్ చేయాలి.
  • ఎవరికైతే డబ్బులు పంపాలో వారి యూపీఐ ఐడీ/ ఫోన్ నెంబర్/ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయాలి.
  • టోటల్ అమౌంట్ ఎంటర్ చేసి, యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి.
  • అంతే.. ఆఫ్‌లైన్ ద్వారా అవతలి వ్యక్తికి సక్సె్స్‌ఫుల్‌గా పేమెంట్ చేరిపోతుంది. అయితే ఇలా చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 0.50 ఛార్జ్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి