AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? సెకన్లలోనే కేవైసీ పూర్తి చేయొచ్చు.. ఈ స్టెప్స్ ఫాలో అయితే ఈజీ..

పీఎఫ్ ఖాతాదారులకు సుభతరంగా సేవలను అందించేందుకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలను మెరుగుపరుస్తోంది. త్వరలోనే తీసుకురానున్న 3.0 వెర్షన్‌లో ఆటో సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇంతేకాకుండా సలువుగా ఆన్‌లైన్‌లో ద్వారా కేవైసీ పూర్తి చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఇది ఎలా చేసుకోవాలి? అనేది ఇప్పుడు చూద్దాం.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? సెకన్లలోనే కేవైసీ పూర్తి చేయొచ్చు.. ఈ స్టెప్స్ ఫాలో అయితే ఈజీ..
Epfo
Venkatrao Lella
|

Updated on: Apr 27, 2026 | 3:08 PM

Share

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గజైనేషన్(EPFO) తన ఖాతాదారులకు డిజిటల్ సేవలను అందిస్తోంది. ఈపీఎఫ్‌వో కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం లేకుండా ఏ పనైనా ఆన్‌లైన్‌ ద్వారా సులువుగా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. అందులో భాగంగా కేవైసీ ప్రాసెస్ సింపుల్‌గా చందాదారులు చేసుకునే సౌలభ్యం అందుబాటులో ఉంది. పీఎఫ్ ఖాతా వివరాలు, ఉద్యోగి వివరాల ధృవీకరణ కోసం కేవైసీ అనేది ఉపయోగపడుతుంది. మీరు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్, పీఎఫ్ విత్ డ్రా లాంటి సేవలను పొందలేరు. అందుకే కేవైసీ అనేది అత్యంత ముఖ్యమైనది.  ఆన్‌లైన్‌ ద్వారా సులువుగా ఎలా కేవైసీ చేసుకోవాలి? అనేది ఇప్పుడు చూద్దాం.

పోర్టల్ ద్వారా ఇలా..

-https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

-యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి

-మేనేజ్ సెక్షన్‌లోకి వెళ్లండి

-మాడిఫై బేసిక్ డీటెయిల్స్‌పై క్లిక్ చేయండి

-మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వంటి వివరాలు ఎంటర్ చేయండి

-యూఐడీఏఐ డేటాతో సిస్టమ్ మీ వివరాలను ఆటో వెరిఫై చేస్తుంది

-అన్ని వివరాలు ఎంటర్ చేశాక అప్డేట్ డీటైల్స్‌పై క్లిక్ చేయండి

-పెండింగ్ ఫర్ ఎంప్లాయర్ అప్రూవర్ అనే స్టేటస్ కనిపిస్తుంది

-కంపెనీ హెచ్‌ఆర్ ఆమోదించాక మీ కేవైసీ ప్రాసెస్ అవుతుంది

అనుమతి అవసరం లేదు

అయితే కేవైసీ సెక్షన్‌లో కొన్ని వివరాలు అప్డేట్ అవ్వడానికి మాత్రమే ఎంప్లాయర్ అనుమతి అవసరం. బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేసుకోవడానికి ఎలాంటి అనుమతి అవసరం ఉండదు. మీ ఈపీఎఫ్‌వో ఖాతాలో ఆధార్, పాన్ కార్డ్ వివరాలు లింక్ అయి ఉంటే బ్యాంక్ అకౌంట్ అప్డేట్ కోసం ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి వెళ్లి సులువుగా బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చుకోవచ్చు. ఇందుకోసం ఎంప్లాయర్ ఆమోదం అవసరం లేదుు. బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ అప్డేట్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, పాన్ కార్డు వివరాలు అప్డేట్‌కు మాత్రం ఖచ్చితంగా ఎంప్లాయర్ అనుమతి ఉండాలి. అయితే పీఎఫ్ ఖాతాతో ఆధార్, పాన్ లింక్ అయి ఉండాలి. అప్పుడు మీరు సులభతరంగా పీఎఫ్ ఖాతాను నిర్వహించుకోవచ్చు. పీఎఫ్ నగదు విత్ డ్రా, పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ సమయంలో మీకు ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వవు. అందుకే ప్రతీఒక్కరూ తమ పీఎఫ్ ఖాతాతో ఆధార్, పాన్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ఈపీఎఫ్‌వో చెబుతోంది. లింక్ చేసుకోనివారు ఉంటే వెంటనే లింక్ చేసుకోవాలి.

Follow Us
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
కేఫ్ రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసా
కేఫ్ రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసా
శ్రేయస్ కంటే ముందే పరువు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్ ఎవరో తెలుసా
శ్రేయస్ కంటే ముందే పరువు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్ ఎవరో తెలుసా
ఆధార్ యూజర్లకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి యాప్ సేవలు బంద్..
ఆధార్ యూజర్లకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి యాప్ సేవలు బంద్..
వీరికి మహర్దశ పట్టబోతోంది.. జీవితంలో ఊహించని భారీ మార్పులు
వీరికి మహర్దశ పట్టబోతోంది.. జీవితంలో ఊహించని భారీ మార్పులు