
పీఎం కిసాన్ నిధుల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 22వ విడత నగదు రైతుల అకౌంట్లో జమ చేయడంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మార్చి 13వ తేదీన రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ అయింది. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో డీబీటీ విధానం ద్వారా నగదు జమ చేయనున్నారు. ఒక్కొక్కరి రైతుల అకౌంట్లో రూ.2 వేలు పడనున్నాయి. ఈ నెల 19న ఉగాది వస్తున్న క్రమంలో.. పండక్కి కంటే ముందు రైతులకు వీటిని ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనర్హులుగా తేలిన కొంతమంది రైతులను పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితా నుంచి తొలగించింది. దీంతో లబ్దిదారుల లిస్టులో మీ పేరు ఉంటేనే అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. అదెలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
-పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి
-ఆ తర్వాత హోమ్ పేజీలో దిగువన బెనిఫీషియరీ లిస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోండి
-ఆ తర్వాత మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది
-అందులో మీ స్టేట్, జిల్లా, సబ్ డిస్ట్రిక్, బ్లాక్, విలేజ్ వంటి వివరాలు సెలక్ట్ చేయండి
-ఆ తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయండి
-అక్కడ మీ గ్రామానికి సంబంధించి పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితా కనిపిస్తుంది
-మీ పేరు లిస్టులో ఉందో.. లేదో చెక్ చేసుకోండి
-లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు జమ అవుతాయి
-పీఎం కిసాన్ Gol యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోండి
-ఆ తర్వాత మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఐడీ ఎంటర్ చేయండి
-అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి
-ఆ తర్వాత లాగిన్‌పై క్లిక్ చేయండి
-హోమ్ పేజీలో బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోండి
-జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకోండి
-సబ్మిట్‌పై క్లిక్ చేయండి
-లబ్దిదారుల జాబితా ఓపెన్ అవుతుంది
-అందులో మీ పేరు ఉందో.. లేదో చెక్ చేసుకోండి
లబ్దిదారుల జాబితాలో పేరు ఉంటే సరిపోదు. మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు. అలాగే సీఎస్‌సీ సెంటర్ ద్వారా కూడా చేసుకోవచ్చు.