రుణ భారం పెరిగిపోతుందా.. ఇలా చేస్తే ఆందోళన అవసరం లేదు.. టైమ్‌లో అప్పులన్నీ ఎగిరిపోతాయంట..

|

Jan 07, 2023 | 4:12 AM

ప్రతి వ్యక్తికి ఎంత ఆస్తి ఉన్నా.. ఎంతో కొంత అప్పు కూడా ఉంటుంది. సాధారణంగా అప్పులకు మించి ఆస్తులు ఉన్నవారు రుణాలు చెల్లించడంలో పెద్ద ఇబ్బందులు పడరు. కాని పేద, మధ్య తరగతి ప్రజలు తమ అప్పులు తీర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. సాధారణంగా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో..

రుణ భారం పెరిగిపోతుందా.. ఇలా చేస్తే ఆందోళన అవసరం లేదు.. టైమ్‌లో అప్పులన్నీ ఎగిరిపోతాయంట..
Business Idea
Follow us on

ప్రతి వ్యక్తికి ఎంత ఆస్తి ఉన్నా.. ఎంతో కొంత అప్పు కూడా ఉంటుంది. సాధారణంగా అప్పులకు మించి ఆస్తులు ఉన్నవారు రుణాలు చెల్లించడంలో పెద్ద ఇబ్బందులు పడరు. కాని పేద, మధ్య తరగతి ప్రజలు తమ అప్పులు తీర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. సాధారణంగా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో రుణ భారం పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటారని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఆదా చేయడం, అప్పు తీర్చడం రెండూ ముఖ్యమైనవే. కొన్ని సందర్భాల్లో ఊహించకుండా వచ్చే యాదృచ్ఛిక ఖర్చుల కోసం తప్పనిసరిగా అత్యవసర పొదుపు నిధిని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అత్యవసర పొదుపు నిధిని ఏర్పాటు చేసుకున్న తర్వాత.. అప్పులు చెల్లిస్తే.. భవిష్యత్తులో రుణ భారం పెరగకుండా ఉంటుందటున్నారు నిపుణులు. అత్యవసర పొదుపు నిధి ఏర్పాటు చేసుకోకపోతే ఎంత సంపాదించినా ఆదాయం కన్పించదు. వడ్డీలు, అసలు చెల్లింపులతోనే సంపాదన ఖర్చు అయిపోతుంది. అప్పుల నుంచి బయటపడటం కూడా కష్టతరమవుతుంది. మొదట ఓ వ్యక్తి తన నికర ఆస్తుల విలువ ఎంతనేది తెలుసుకోవాలి. మొత్తం ఆస్తుల నుంచి అప్పులు తీసివేస్తే నికర విలువ వస్తుంది.

కొంతమందికి ఎటువంటి ఆస్తులు ఉండవు. రుణం తీసుకుంటారు. అలాంటప్పుడు ఆర్థిక బాధ్యతలు మాత్రమే ఆ వ్యక్తికి ఉంటాయి. ఎక్కువ మంది తమకు అనుకోకుండా వచ్చే ఖర్చుల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చడం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ.. మరిన్ని రుణాలు చేయడాన్ని అలవాటు చేసుకుంటారు. అందుకే తొలుత ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత మొత్తాన్ని తీసి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అప్పుల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.

అప్పుల బాధ ఎక్కువుగా ఉందని చాలా మంది చింతిస్తూ ఉంటారు. ఆ రుణాలు తీర్చడానికి తమ సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తారు. అప్పులు ఉన్నవారు కూడా కొద్ది నెలల పాటు ఓ అత్యవసర పొదుపు నిధిని ఏర్పాటు చేసుకున్న తర్వాత.. తమ రుణాలను చెల్లి్ంచాలి. అప్పులు చెల్లించే సమయంలో మధ్యలో ఏవైనా ఊహించని ఖర్చులు వస్తే రుణం వైపు వెళ్లకుండా.. అత్యవసర పొదుపు నిధిలో డబ్బులు తీసి ఖర్చు చేయడం ద్వారా అప్పుల వైపు మళ్లకుండా ఉండొచ్చు. ఇలా చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న రుణాలు తీరిపోయిన తర్వాత అప్పులు లేకుండా రుణ రహితంగా మారి.. ప్రశాంత జీవనం గడపవచ్చంటున్నారు నిపుణులు. అత్యవసర పొదుపు నిధిని మన స్థోమత, సంపాదన, ఆర్థిక సామర్థ్యం మేరకు ఏర్పాటు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..