Emergency fund: కష్టకాలంలో ఆదుకొనే ‘ఎమర్జెన్సీ ఫండ్’.. ఇదే బెస్ట్ పొదుపు మంత్రం.. అస్సలు మిస్ అవ్వొద్దు..

|

Feb 21, 2023 | 12:52 PM

జీవితం సాఫీగా సాగాలంటే ‘ఆర్థిక భద్రత’ తప్పనిసరి. అనారోగ్యం, నిరుద్యోగం మొదలైన సమస్యలు చుట్టు ముట్టినప్పుడు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఓ రక్షణ కవచం ఉండాల్సిందే.

Emergency fund: కష్టకాలంలో ఆదుకొనే ‘ఎమర్జెన్సీ ఫండ్’.. ఇదే బెస్ట్ పొదుపు మంత్రం.. అస్సలు మిస్ అవ్వొద్దు..
Emergency Fund
Follow us on

జీవితం సాఫీగా సాగాలంటే ‘ఆర్థిక భద్రత’ తప్పనిసరి. అనారోగ్యం, నిరుద్యోగం మొదలైన సమస్యలు చుట్టు ముట్టినప్పుడు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఓ రక్షణ కవచం ఉండాల్సిందే. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేం. అన్నీ మనం అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. అప్పటి వరకూ బిందాస్ గా ఉన్న జీవితం ఒక్కసారిగా కుదేలు అయిపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో అందుకు ఉపయోగపడేదే ఎమర్జెన్సీ ఫండ్. ఈ అత్యవసర నిధితోనే ఆ భరోసా సాధ్యం అవుతుంది. దీన్నే ‘రిస్క్‌ మేనేజ్‌మెంట్‌’ అని కూడా అంటారు. ప్రతి మనిషి, లేదా కుంటుంబానికి ఇది అవసరమే. ఈనేపథ్యంలో అత్యవసర నిధిని సమకూర్చుకునేందుకు నిపుణులు చెబుతున్న కొన్ని సూచనలు ఇవి.

చిన్నగా మొదలు పెట్టాలి.. ఎమర్జెన్సీ ఫండ్​లో రాత్రికి రాత్రే భారీ మొత్తంలో నిధులు వేయడం చాలా కష్టమైన పని. అందుకే చిన్న చిన్నగా మొదలుపెట్టాలి. ఎమర్జెన్సీ ఫండ్​లో ఎంత నిధులు వేస్తున్నాము అని కాకుండా.. ఎంత రెగ్యులర్​గా వేస్తున్నాము అన్నదే ముఖ్యం. నెలకు రూ. 200, రూ. 500 వేసినా పర్లేదు. కానీ ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఫండ్​లో ఎంతో కొంత నిధులు వేస్తూ ఉండాలి.

టార్గెట్ పెట్టుకోవాలి.. ఎమర్జెన్సీ ఫండ్​లో ఎంత మేర నిధులు ఉండాలన్నది ముందే నిర్ణయించుకోవాలి. సాధారణంగా అయితే.. 3-6 నెలల పాటు మన అన్ని ఖర్చులకు సరిపడా నిధులు ఎమర్జెన్సీ ఫండ్​లో ఉండటం శ్రేయస్కరం అని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఒకవేళ మన మీద ఆధారపడి ఎవరైనా ఉంటే.. వారి ఖర్చులను కూడా కలుపుకునే ఎమర్జెన్సీ ఫండ్​ టార్గెట్​ పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆటోమెటిక్​గా కట్​ అవ్వాలి.. మ్యూచువల్​ ఫండ్స్​, లోన్స్​.. ఇప్పుడు చాలా వరకు అన్ని ఆటోమెటిక్​గానే కట్​ అయిపోతున్నాయి. ఎమర్జెన్సీ ఫండ్​కి కూడా ఈ వెసులుబాటును ఇచ్చే విధంగా మనం చర్యలు చేపట్టాలి. అప్పుడు మనం మర్చిపోవడానికి వీలు కూడా ఉండదు.

వేరే అకౌంట్​ ఏర్పాటు చేసుకోవాలి.. మన సేవింగ్స్​, కరెంట్​ అకౌంట్​ వంటిని, ఎమర్జెన్సీ ఫండ్​తో ముడిపెట్టకూడదు. ఎమర్జెన్సీ ఫండ్​ కోసం ప్రత్యేకంగా ఒక అకౌంట్​ ఉండాలి. ఈ విధంగా.. పొరపాటునైనా ఎమర్జెన్సీ ఫండ్​ నుంచి డబ్బులు తీసే అవకాశం ఉండకుండా చూసుకోవాలి.

ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎమర్జెన్సీ ఫండ్​లో వేసే నిధులను ఎప్పటికప్పుడు పెంచుకుంటే వెళితే.. మన టార్గెట్​ను తొందరగా చేరుకుంటాం. ఇందుకోసం ఒక చిన్న సలహా ఇస్తుంటారు ఆర్థిక నిపుణులు. కొంత కాలం అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని, మిగిలిన డబ్బులను ఎమర్జెన్సీ ఫండ్​లో వేస్తే మంచిదని సూచిస్తుంటారు.

ఆదాయాన్ని పెంచుకోవాలి.. సాధ్యమైతే మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి వ్యూహాలను పరిశీలించాలి. దీన్ని సాధించడానికి పార్ట్ టైమ్ జాబ్ లేదా ఫ్రీలాన్స్ ఎంప్లాయిమెంట్ చేసుకోవచ్చు. మీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, అదనపు ఆదాయాన్ని చూసుకోవడం కూడా ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..