
భారతదేశంలో రైల్వే టిక్కెట్లు పొందడం అనేది ఒక సవాలు. ముఖ్యంగా దీపావళి వంటి పండుగల సమయంలో, రైలు టిక్కెట్లు దొరకడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు నెలలు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటారు. అయితే గతంలో 120 రోజులకు ముందే రైల్వే టికెట్ బుక్ చేసుకునేందుకు ఉన్న అవకాశాన్ని ఇప్పుడు రైల్వేశాఖ 60 రోజులకు కుదించింది. ఎందుకంటే ఇంత లాంగ్ గ్యాప్ ఉన్నందుకు కొందరు రైల్వే టికెట్స్ బుక్ చేసుకొని చివరి నిమిషంలో రద్దు చేసుకుంటారు. అలాంటి టికెట్స్‌ను ప్రయాణీకులు అందుబాటులో ఉంచేందుకు ప్రయాణ తేదీకి ముందు రోజు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వీలుగా, రైల్వేశాఖ తత్కాల్ టికెట్ బుకింగ్ సౌకర్యం తీసుకొచ్చింది. కానీ ఈ టిక్కెట్లు ఎక్కువ సమయం ఉండవు.. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇవి అమ్ముడవుతాయి. అయితే ఈ తత్కల్ టికెట్స్ తర్వాత కూడా మళ్లీ రైల్వే టికెట్స్ బుక్‌చేసుకునేందుకు రైల్వే శాఖ ఒక కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. అదే కరెంట్ టికెట్..ఈ కరెంట్ టికెట్ ఆప్షన్ ద్వారా మనం రైలు బయలుదేరే చివరి నిమిషంలో కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఇదే మీ వ్యక్తిత్వం.. నిద్రించే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలానో తెలుసా
కరెంట్ బుకింగ్ టికెట్ అప్షన్ అంటే.. తత్కాల్ బుకింగ్ తర్వాత రైలులో కొన్ని సీట్స్ ఖాళీగా ఉంటాయి. అలా మిగిలిపోయిన సీట్లతో రైల్వే అధికారులు ఒక చార్జ్ ప్రిపేర్ చేస్తారు. అంటే, రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు ఈ చార్ట్ రెడీ చేస్తారు. ఆ ఛార్జ్‌లో ఖాళీగా ఉన్న సీట్లను తిరిగి బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత, ఖాళీ సీట్లను కరెంట్ రిజర్వేషన్ పద్ధతి ద్వారా బుక్ చేసుకోవడానికి ప్రియాణికులకు అందుబాటులో ఉంచుతారు. రైలు బయలుదేరడానికి సరిగ్గా 30 నిమిషాల ముందు మీరు ఈ టికెట్స్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: తొక్కలో ఏముందని తీసి పడేస్తున్నారా? ఇది తెలిస్తే అస్సలు వదలరు!
ఇది కూడా చదవండి: ఈ “టీ” రోజూ ఒక్కకప్పు తాగండి.. ఆ సమస్యలకు ఛూమంత్రం వేసినట్లే.. మీ జోలికి రావంతే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.