Gas Cylinder: ప్రభుత్వం నుంచి ఉచిత గ్యాస్ కనెక్షన్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. ఎలానో చూడండి

రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్లతో పాటు సబ్సిడీపై రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఎవరెవరకు దీనికి అర్హులు..? ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాలి..? అనే వివరాలు ఇక్కడ చూద్దాం.

Gas Cylinder: ప్రభుత్వం నుంచి ఉచిత గ్యాస్ కనెక్షన్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. ఎలానో చూడండి
Gas Cylinders

Updated on: Dec 07, 2025 | 8:09 PM

PM Ujjwala Yojana: ప్రతీ ఇంట్లో వంటగ్యాస్ అనేది అవసరం. వంటగ్యాస్ లేనిది వంటిట్లో ఏ పని కూడా ముందుకు కదలదు. వీటి ధరలు కూడా సామాన్యులకు భారంగా మారాయి. సిలిండర్ ధర రూ.900 వరకు ఉండటంతో రోజూవారీ కూలీ చేసుకునే బ్రతికేవారికి అది గుడిబండగా మారింది. దీంతో సామాన్యులకు భారం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత గ్యాస్ సిలిండర్లు లేదా రూ.500కే సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నాయి. వీటి వల్ల సామాన్య ప్రజలకు వంట గ్యాస్‌పై పెట్టే ఖర్చు తగ్గి ప్రయోజనం జరుగుతుంది. అందులో భాగంగా పేద ప్రజలకు తక్కువ ధరకు వంట గ్యాస్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పధకం వివరాలు ఏంటో చూద్దాం.

పీఎం ఉజ్వల యోజన

పేద కుటుంబాలు కూడా వంట గ్యాస్ ఉపయోగించాలనే ఉద్దేశంతో కేంద్రం 2016 మే1న ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్‌ను అందిస్తున్నారు. అలాగే వీరికి రూ.550కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నారు. ఇలా ఏడాదికి 12 సిలిండర్ల వరకు వరకు సబ్సిడీపై ఇస్తున్నారు. అలాగే ఇతర వస్తువులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ ద్వారా 12 కోట్లకుపైగా ప్రజలు లబ్ది పొందుతున్నారు.

అర్హతలు ఇవే

మహిళలు మాత్రమే ఈ పధకానికి అర్హులు. మహిళ భారత పౌరురాలు అయి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి. ఇక పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్, అంత్యోదయ అన్న యోజన లబ్దిదారులుగా ఉండాలి. ఇక షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలకు చెందినవారై ఉండాలి.

కావాల్సిన డాక్యుమెంట్లు

ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సమర్పించాలి.

దరఖాస్తు ఎలా చేసుకోవాలి..?

-ఉజ్వల యోజన వెబ్‌సైట్ https://pmuy.gov.in/index.aspx ఓపెన్ చేయండి
-ఉజ్వల యోజన 2.0 కనెక్షన్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా కనెక్షన్ పొందాలనుకుంటున్నారో ఆ కంపెనీ పేరును ఎంచుకోండి.
-మీ పేరు, మొబైల్, ఈమెయిల్ వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి
-ఆ తర్వాత రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ అవ్వండి
-రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్, ఏజెన్సీ పేరును ఎంచుకుని కేవైసీ కంప్లీట్ చేయాలి
-రేషన్ కార్డు, కుటుంబసభ్యులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించండి
-ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకుని మీరు ఎంచుకున్న గ్యాస్ ఏజెన్సీ వారిని కలవండి