జీతం డబ్బులు చేతిలో నిలవడం లేదా? ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులు కావొచ్చు!

Smart Money Management Secrets: నెల జీతం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఖాళీ అయిపోతుందా? సరైన బడ్జెట్, క్రమబద్ధమైన పొదుపు, తెలివైన ఆర్థిక ప్రణాళికతో మధ్యతరగతి జీతగాళ్లు కూడా సంపదను సృష్టించి కోటీశ్వరులు కావచ్చు. జీతం డబ్బు వృథా కాకుండా మీ జేబులో నిలిచేలా చేసే కీలక ఆర్థిక చిట్కాలను తెలుసుకోండి.

జీతం డబ్బులు చేతిలో నిలవడం లేదా? ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులు కావొచ్చు!
Smart Money Management Secrets

Updated on: Jul 01, 2026 | 5:43 PM

చాలా మంది మధ్యతరగతి జీతగాళ్లకు ఖర్చులను ఎలా ప్లాన్ చేసుకోవాలి..? డబ్బు ఎలా పొదుపు చేయాలి..? సరైన అవగాహన ఉండదు. దీనివల్ల నెల ఆఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి కూడా మిగలదు. నెల చివరి రోజు లేదా మొదటి రోజో బ్యాంక్ అకౌంట్‌లో జీతం పడ్డ సంతోషం ఒకట్రెండు రోజులకే ఆవిరైపోతుంది. అయితే సామాన్య జీతగాళ్లు కూడా కోటీశ్వరులు కావాలని కలలుకంటుంటారు. బడ్జెట్ ప్లాన్, పొదుపు చర్యలతో పాటు మరికొన్ని జాగ్రత్తలతో మధ్యతరగతికి చెందిన సామాన్య జీతగాళ్లు కూడా కోటీశ్వరులు కావొచ్చు. జీతం డబ్బును వృథా చేయకుండా.. మీ ప్యాకెట్‌లో నిలిచేందుకు మీరు అనుసరించాల్సిన గోల్డెన్ రూల్స్ ఇవే..

1. పక్కాగా బడ్జెట్ ప్లాన్ చేసుకోండి

చాలా మంది ఇంటి ఖర్చులకు సరైన బడ్జెట్ వేసుకోకుండా డబ్బును మంచి నీళ్లులా ఖర్చు పెడతారు. జీతం రాగానే ఒక క్రమశిక్షణతో బడ్జెట్ రాసుకుని, పొదుపుగా ఉంటే భవిష్యత్తు జీవితానికి అది పెద్ద సాయంగా మారుతుంది.

2. అప్పులకు దూరంగా ఉండండి

ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేని అప్పులు చేయకండి. అప్పులు చేస్తే నెలనెలా వడ్డీలు కట్టడానికే మీ జీతంలో సగం డబ్బు సరిపోతుంది. అత్యవసర పరిస్థితి వస్తే తప్ప, విలాసాల కోసం అప్పులు చేయడం అస్సలు మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

3. ముందే ఖర్చులను వేరు చేయండి

జీతం చేతికి రాగానే.. ఇల్లు అద్దె, కిరాణా సామాన్లు, మెడికల్ ఖర్చులు, కరెంట్ బిల్లు వంటి అత్యవసర అవసరాలకు సంబంధించిన డబ్బును ముందే పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వల్ల వృథా ఖర్చులను వీలైనంత మేరకు తగ్గించోవచ్చు.

4. వీలైనంత త్వరగా పొదుపు ప్రారంభించండి

మీరు ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే, భవిష్యత్తులో అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ప్రతి నెలా వచ్చే జీతంలో ఒక చిన్న మొత్తాన్ని ఖచ్చితంగా భవిష్యత్తు పొదుపు ఖాతాలో వేయండి. ఖర్చుల తర్వాత మిగిలిన డబ్బును పొదుపు చేయడం కాకుండా.. జీతంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసిన తర్వాత మిగిలిన డబ్బును ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి.

5. ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోండి

ఉద్యోగం కోల్పోవడం, అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు లేదా ప్రమాదాలు వంటి ఊహించని ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి ప్రతి నెలా కొంత డబ్బును ‘ఎమర్జెన్సీ ఫండ్’ రూపంలో దాచుకోవాలి.

6. ఆర్థిక నిర్వహణ నేర్చుకోండి

మీ డబ్బును ఎక్కడ, ఎలా ఖర్చు పెట్టాలి? ఏ ఖర్చు ముఖ్యం? ఏది ముఖ్యం కాదు? అనే విషయాలపై అవగాహన పెంచుకోండి. ఇది మీ జీవన ప్రమాణాలను పెంచడానికి, మూలధనాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది.

7. విలాసవంతమైన ఖర్చులకు స్వస్తి చెప్పండి

అవసరానికి, విలాసానికి మధ్య ఉన్న తేడాను గుర్తించండి. ఉదాహరణకు.. సొంత ఇల్లు అనేది ఒక అవసరం.. కానీ ఖరీదైన కారు కొనడం అనేది విలాసం. ఇలాంటి విలాసవంతమైన ఖర్చులను తగ్గిస్తే అప్పుల ఊబిలో పడకుండా ఉండొచ్చు.

8. పేదలకు సాయం చేయండి

మీరు సంపాదించే జీతం నుండి ప్రతి నెలా మీ వీలును బట్టి కొంత చిన్న మొత్తాన్ని పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి సహాయంగా ఇవ్వండి. ఇతరులకు సహాయం చేయడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.

9. రిటైర్మెంట్ కోసం దాచుకోండి

ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా.. గౌరవంగా, ధైర్యంగా జీవించడానికి వీలుగా ఇప్పుడే రిటైర్మెంట్ కోసం చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి.

Also Read: రతన్ టాటా చెప్పిన ECG ఫార్ములా..ఇది తెలిస్తే మీరు ఓటమికి భయపడరు..!

Loading...
Unable to load recommendations.
Follow Us