Tax On Petrol: చమురు ధరల పెరుగుదలకు కారణం ఏదైనా ఆ భారం మాత్రం సామాన్యులపైనే పడుతోంది. దీనికి తోడు దేశంలో పెట్రో డీజిల్(Petrol Diesel) ధరలపై ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు కూడా భారీగానే ఉన్నాయి. 137 రోజుల విరామం తరువాత దేశంలో చమురు ధరల పెరుగుదల రెండు రోజుల నుంచి మళ్లీ ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వినియోగదారులు రూ.100 విలువైన పెట్రోల్ కొనుగోలుపై ఎంత పన్నులు చెల్లిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అత్యధికంగా చమురుపై పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో మెుదట మహారాష్ట్ర రూ. 52.50 తో నిలవగా.. తరువాతి స్థానంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రూ. 52.40 వసూలు చేస్తోంది. దీని తరువాతి స్థానంలో తెలంగాణలో(Telangana) రూ.51.60, రాజస్థాన్ లో రూ.50.80, మధ్యప్రదేశ్ లో రూ.50.60, కేరళలో రూ.50.20, బిహార్ లో రూ.50 వసూలు చేస్తున్నాయి. అంటే రూ.100 విలువైన చమురులో కనీసం 50 శాతానికి పైగా పన్నుల రూపంలో వినియోగదారులు పైన తెలిపిన రాష్ట్రాల్లో టాక్స్ చెల్లిస్తున్నారు.
ఇదే సమయంలో 50 శాతానికి కొద్దిగా తక్కువలో ఒడిశాలో రూ.48.90, పశ్చిమ బంగాలో 48.70, తమిళనాడులో రూ.48.60, ఛత్తీస్ ఘడ్ లో రూ.48.30, కర్ణాటకలో రూ.48.10 చొప్పున పన్ను రూపంలో వినియోగదారులు ప్రస్తుతం చెల్లిస్తున్నారు. దేశంలో అత్యల్పంగా లక్ష్యద్రీప్ లో రూ. 34.60, అండమాన్ నికోబార్ లో రూ.35.30 చమురుపై పన్ను రూపంలో వసూలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే ఎక్సేజ్ డ్యూటీ విధిస్తుండగా.. వివిధ రాష్ట్రాల్లో మాత్రం సేల్స్ టాక్స్, వ్యాట్ టాక్స్ రేట్లు వేరువేరుగా ఉన్నాయి. దేశంలోని రాష్ట్రాల్లో చమురుపై విధిస్తున్న టాక్స్ వివరాలను ఈ ట్వీట్ లో చూడండి..
How much Tax do you pay for ₹100 worth of Petrol?
Upto half of it. pic.twitter.com/IMbhGJudEw— Stats of India (@Stats_of_India) March 22, 2022
చమురుపై తాజా రేటు పెంపు తరువాత దిల్లీలో లీటర్ పెట్రోలు రూ.97.01, ముంబయిలో రూ.111.60, కోల్‌కతాలో రూ.95.85, చెన్నైలో రూ.106.30 గా ఉన్నాయి.
ఇవీ చదవండి..
5G Technology: 5G సాంకేతికత అందించేందుకు సిద్ధమంటున్న భారత ఐటీ దిగ్గజం
Multibagger Returns: ఏడాదిలో పెట్టుబడిని రెండింతలు చేసిన రియల్ ఎస్టేట్ మల్టీబ్యాగర్ స్టాక్..