AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రంతా కూలర్ వాడితే నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా..? ఈ లెక్కలు తెలుసుకోండి..

వేసవి ఎండలు మండిపోతున్నాయి.. పగలు భానుడి భగభగలు, రాత్రి వేళ ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మధ్యతరగతి ఇళ్లలో ఏసీల కంటే కూలర్లే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే.. ఏసీతో పోలిస్తే కూలర్ బిల్లు తక్కువే కదా అని మనం నిర్లక్ష్యంగా గంటల తరబడి వాడుతుంటాం. కానీ మీరు వాడే కూలర్ మీ నెలాఖరు కరెంటు బిల్లును ఎంత పెంచుతుందో తెలుసా..?

రాత్రంతా కూలర్ వాడితే నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా..? ఈ లెక్కలు తెలుసుకోండి..
How Much Electricity Does An Air Cooler Consume
Krishna S
|

Updated on: Apr 27, 2026 | 2:46 PM

Share

వేసవి కాలం రానే వచ్చింది. భానుడి భగభగలకు తోడు ఉక్కపోత సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లలో ఏసీలు, కూలర్లు 24 గంటలూ తిరుగుతూనే ఉన్నాయి. అయితే, మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఏసీల కంటే కూలర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ కూలరే కదా.. బిల్లు తక్కువే వస్తుంది అని చాలా మంది భావిస్తుంటారు. కానీ కూలర్ వల్ల కూడా భారీగా బిల్ వస్తుంది.  సాధారణంగా మన దేశంలో లభించే ఎయిర్ కూలర్లు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. వాటి మోటార్ సామర్థ్యాన్ని బట్టి విద్యుత్ వినియోగం మారుతూ ఉంటుంది. పర్సనల్, టవర్ కూలర్లు చిన్న గదులకు సరిపోతాయి. ఇవి గంటకు సుమారు 100 నుండి 150 వాట్ల విద్యుత్‌ను మాత్రమే తీసుకుంటాయి. మీడియం సైజ్ కూలర్లు గంటకు 150 నుండి 200 వాట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తాయి. పెద్ద హాల్స్ లేదా బయట వాతావరణం కోసం వాడే ఇవి సగటున 200 నుండి 250 వాట్ల శక్తిని తీసుకుంటాయి. ఒకవేళ మోటార్ పాతదైతే ఇది 300 వాట్లకు కూడా చేరవచ్చు.

గంటల లెక్కన విద్యుత్ వినియోగం ఎంత?

మనం సగటున ఒక 220 వాట్ల డెసర్ట్ కూలర్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. దాని వినియోగం ఇలా ఉంటుంది.. 220 వాట్లు అంటే గంటకు 0.22 యూనిట్లు. రాత్రి పూట 8 గంటలు వాడితే 1.76 యూనిట్లు అవతుతుంది. రోజంతా 15 గంటల పాటు వాడితే 3.30 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది.

నెలాఖరులో బిల్ ఎంత?

రాష్ట్రాలను బట్టి విద్యుత్ ధరలు మారుతుంటాయి. 2026 నాటికి సగటున గృహ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.5 నుండి రూ.8 వరకు ఉంది. మనం సగటున రూ.6.50 ధరతో లెక్కవేస్తే రాత్రి 8 గంటల పాటు వాడితే నెలకు 53 యూనిట్లు అవతుంది. దీన్ని ప్రకారం రూ.340 – రూ.350 వరకు బిల్ ఎక్స్ ట్రా అవుతుంది. అదే రోజుకు 14 గంటలు వాడితే 92 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఈ లెక్కన నెలకు రూ.600 బిల్ అవుతుంది. ఇక రోజుకు 15 గంటలు వాడితే నెలకు 99 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. దీన్ని ప్రకారం రూ.640 – రూ.650 వరకు బిల్ వస్తుంది.

పాత కూలర్లు vs కొత్త టెక్నాలజీ

మీరు పదేళ్ల క్రితం నాటి పాత కూలర్ వాడుతున్నారా? అయితే బిల్ మోత మోగిపోతుంది. పాత కూలర్లు మోటార్ అరిగిపోవడం వల్ల అవి ఎక్కువ విద్యుత్‌ను లాగుతాయి. ఇవి దాదాపు 300 వాట్ల వరకు విద్యుత్‌ను ఖర్చు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన BLDC మోటార్ కూలర్లు కేవలం 100-150 వాట్లతోనే అద్భుతమైన గాలిని ఇస్తాయి. ఇవి సాధారణ కూలర్ల కంటే 50శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి.

విద్యుత్ బిల్లు తగ్గించుకోవడానికి చిట్కాలు

మీరు చల్లగా ఉండాలి, అదే సమయంలో బిల్లు కూడా తగ్గాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

  • కూలర్ వాడేటప్పుడు గది కిటికీలు మూసివేయొద్దు.. గాలి బయటకు వెళ్లే మార్గం ఉంటేనే చల్లదనం పెరుగుతుంది.. మోటార్‌పై భారం తగ్గుతుంది.
  • కూలర్ గడ్డిని మార్చడం, ఫ్యాన్ బెల్ట్ లేదా మోటార్‌కు ఆయిలింగ్ చేయడం వల్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది.
  • గది చల్లబడిన తర్వాత కొద్దిసేపు వాటర్ పంప్ ఆపేసి కేవలం ఫ్యాన్ మాత్రమే వాడండి.
  • ఫ్యాన్‌ను ఎప్పుడూ హై స్పీడ్‌లో ఉంచకుండా మీడియం లేదా లో స్పీడ్‌లో ఉంచితే విద్యుత్ ఆదా అవుతుంది.

వేసవిలో చల్లదనం ముఖ్యం.. కానీ అది ఆర్థిక భారంగా మారకూడదు. మీ వద్ద ఉన్న కూలర్ సామర్థ్యాన్ని గమనించి, అవసరమైన మేరకు మాత్రమే వాడటం ద్వారా మీ కరెంటు బిల్లును నియంత్రించుకోవచ్చు. ఒకవేళ మీ బిల్లు అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తుంటే.. వెంటనే నిపుణులైన మెకానిక్‌తో కూలర్‌ను చెక్ చేయించుకోండి.

Follow Us