India Currency Printing: ప్రస్తుతం ఏ పని చేయాలన్న డబ్బు అవసరం. డబ్బుతోనే ఏదైనా చేయవచ్చు. ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్నో రకాల నోట్లు చెలామణిలో ఉన్నాయి. గతంలో పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత వాటి స్థానంలో రూ.500 నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలో నాణెలు, నోట్లు చలామణిలో కొనసాగుతున్నాయి. కరెన్సీ నోట్ల విషయానికి వస్తే ప్రస్తుతం రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు ముద్రిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ). అయితే ఈ నోట్లను ముద్రించేందుకు కూడా ఎంతో ఖర్చు చేయాల్సి వస్తుంది. భారతీయ కరెన్సీ నోట్ల ముద్రణపై వ్యయం రూ.5,101 కోట్లకు చేరుకుందని ఇటీవలే గణాంకాలు విడుదల అయ్యాయి. మరి మనం ప్రతి రోజు ఉపయోగించే నోట్లకు ఎంత ఖర్చు అవుతోందో తెలుసా? ఏ నోటుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం.
ప్రస్తుతం చలామణిలో ఉన్న అతిపెద్ద నోటుగా రూ.500 ఉంది. 2016 వరకు అందుబాటులో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసిన తర్వాత కొత్తగా రూ.500 నోట్లు చెలామణిలోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. అయితే, గత ఏడాది రూ. 2000 నోట్లను సైతం చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 500 నోట్లకు ఒక్క నోటు ముద్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ రూ. 2.94 ఖర్చు చేస్తోంది.
ప్రస్తుతం మరో పెద్ద నోటు అయిన రూ.200 నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఈ నోటు ముద్రించేందుకు రిజర్వ్ బ్యాంకుకు రూ.2.93 ఖర్చు చేస్తోంది. తర్వాత రూ. 100 నోటు ఉన్నాయి. ఈ నోటును ముద్రించేందుకు రూ. 1.77 ఖర్చు చేస్తోంది. తర్వాత రూ.50 నోటు. ఈ నోటును ముద్రించేందుకు రూ. రూ. 1.13 ఖర్చు చేస్తున్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.
ఇక రూ. 20 నోటు. దీనిని ముద్రించేందుకు ఒక్కో నోటుకు రూ. 0.95 ఖర్చు చేస్తున్నట్లు ఆర్బీఐ చెబుతోంది. అలాగే చిన్న నోట్ అయిన రూ.10 చెలామణిలో కొనసాగుతుంది. ఈ పది రూపాయల నోటును ముద్రించేందుకు ఒక్కో నోటుకు రూ.0.96 ఖర్చు చేస్తున్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి