
బంగారం అనేది ఆర్థిక అవసరం ఉన్న సమయాల్లో రుణం పొందడంలో సహాయపడే విలువైన ఆస్తి అని అందరికీ తెలిసిందే. అనేక బ్యాంకులతో పాటు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తాయి. అత్యవసర సమయంలో నగదు కావాలంటే బంగారం ద్వారా రుణం పొందడం సులభంగా ఉంటుంది. విస్తృతమైన డాక్యుమెంటేషన్, క్రెడిట్ తనిఖీలను కలిగి ఉండే వ్యక్తిగత రుణాల మాదిరిగా కాకుండా బంగారం రుణం పొందడం సులభం. న్యాయమైన రుణ విధానాలను నిర్ధారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు రుణాలను నియంత్రిస్తుంది. రుణదాతలు లోన్ టు వాల్యూ నిష్పత్తి ఆధారంగా రుణ మొత్తాన్ని నిర్ధారిస్తారు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు బంగారంపై ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న విలువ ఆధారంగా 75 శాతం వరకు రుణాన్ని ఇవ్వచ్చు. అంటే మీ బంగారం రూ. లక్ష విలువ చేస్తే మీరు మీరు రూ. 75,000 వరకు రుణం పొందవచ్చు. అయితే, కొంతమంది రుణదాతలు వారి రిస్క్ అసెస్‌మెంట్ పాలసీలను బట్టి తక్కువ మొత్తాలను అందిస్తారు.
రుణదాతలు 18 క్యారెట్లు లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత స్థాయిలతో ఉన్న బంగారంపై కూడా రుణాలను అందిస్తారు. అధిక స్వచ్ఛత కలిగిన బంగారానికి ఎక్కువ విలువ ఉంటుంది. అధిక రుణ మొత్తానికి అర్హత ఉంటుంది.
విలువ కట్టడానికి బంగారం కంటెంట్ మాత్రమే పరిగణిస్తారు. ఆభరణాలపై ఉన్న ఏవైనా రాళ్ళు, రత్నాలు లేదా ఇతర అటాచ్‌మెంట్‌లు మినహాయించి రుణాన్ని అందిస్తారు.
బంగారంపై రుణ మొత్తం ప్రస్తుత బంగారం రేటుపై ఆధారపడి ఉంటుంది. ఇది రోజువారీగా మారుతుంది. అధికంగా బంగారం ధరలు ఉంటే అధిక రుణ అర్హతకు వీలు ఉంటుంది.
కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు తమ రుణ ఉత్పత్తులను భిన్నంగా రూపొందించడం ద్వారా మెరుగైన రుణ మొత్తాలను అందిస్తాయి. అయినప్పటికీ 75 శాతం లోన్ టు వాల్యూ క్యాప్‌నకు కట్టుబడి ఉండాలి.
బంగారు రుణ వడ్డీ రేట్లు రుణదాతను బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా, బ్యాంకులు సంవత్సరానికి 9-10 శాతం నుంచి తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే ఎన్‌బీఎఫ్‌సీలు సంవత్సరానికి 28 శాతం వరకు రేట్లను వసూలు చేయవచ్చు. రేట్లలో వ్యత్యాసం వివిధ రుణదాతలు అందించే వివిధ రిస్క్ అసెస్‌మెంట్‌లు, రీపేమెంట్ షెడ్యూల్ ఆధారంగా ఉంటుంది. అలాగే బంగారు రుణాలకు రుణ కాలపరిమితి సాధారణంగా కొన్ని నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. తక్కువ కాలపరిమితి తరచుగా తక్కువ వడ్డీ రేట్లతో వస్తుంది. అయితే ఎక్కువ కాలపరిమితి తిరిగి చెల్లించడంలో ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. రుణగ్రహీతలు రుణ కాలపరిమితిని ఎంచుకునే ముందు వారి ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి