Indian Railway: రైల్వేస్టేషన్‌లో ఓ ట్రైన్‌కు ప్లాట్‌ఫామ్ ఎలా నిర్ణయిస్తారో తెల్సా

రైల్వే స్టేషన్‌లో ఏ ట్రైన్ ఏ ప్లాట్‌ఫామ్‌కు రావాలో ఎవరు నిర్ణయిస్తారు? కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే ఉంటుందా లేక మరేదైనా కారణాలు ఉంటాయా? వందే భారత్, రాజధాని వంటి రైళ్లకు ఎందుకు ఎప్పుడూ ఒకటో ప్లాట్‌ఫామ్ ఇస్తారు? విజయవాడ, సికింద్రాబాద్ లాంటి పెద్ద జంక్షన్‌లలో ప్లాట్‌ఫామ్ కేటాయింపు వెనుక ఉన్న అసలు రహస్యాలు ఈ కథనంలో..

Indian Railway: రైల్వేస్టేషన్‌లో ఓ ట్రైన్‌కు ప్లాట్‌ఫామ్ ఎలా నిర్ణయిస్తారో తెల్సా
New Trains

Updated on: May 09, 2026 | 12:56 PM

రైలు ప్రయాణంలో ప్లాట్‌ఫామ్ నంబర్ తెలుసుకోవడం ప్రయాణికులకు చాలా ముఖ్యం. ప్రతి స్టేషన్‌లో దీని కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. దానిని ‘స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ అని పిలుస్తారు. అంటే ఏ రైలు ఏ సమయానికి రావాలి, ఏ ప్లాట్‌ఫామ్‌పై ఆగాలి అనే షెడ్యూల్ ముందే ఉంటుంది. అయితే, కొన్నిసార్లు రైళ్లు ఆలస్యమైనప్పుడు ఈ కేటాయింపుల్లో మార్పులు జరుగుతుంటాయి. ప్లాట్‌ఫామ్ కేటాయింపును ప్రభావితం చేసే ప్రధాన అంశాలు ఇవే:

ఇది చదవండి: 10 వేల EMIతో 30 లక్షల ఇల్లు కొనుక్కోవడం ఎలా.? ఇది తెలియక చాలామంది..

1. రైలు ప్రాధాన్యత:

వందే భారత్, రాజధాని, శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రయాణికులకు స్టేషన్ నుండి సులభంగా బయటకు వెళ్లే వీలు కల్పించడానికి వీటికి గరిష్టంగా ప్లాట్‌ఫామ్ నంబర్ 1 కేటాయిస్తారు. మెయిన్ ఎంట్రన్స్ కు దగ్గరగా ఉండటం వల్ల ప్రయాణికులు సులభంగా లోపలికి రావడానికి, బయటకు వెళ్లడానికి వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

2. ప్రయాణ దిశ:

రైలు ఏ వైపు నుండి వస్తోంది, ఏ వైపు వెళ్తోంది అనేది చాలా ముఖ్యం. ఎక్కువ ట్రాక్‌లు మారకుండా నేరుగా మెయిన్ లైన్‌లోకి వెళ్లిపోయేలా ప్లాట్‌ఫామ్‌ను ఎంపిక చేస్తారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగదు.

3. రైలు పొడవు:

అన్ని ప్లాట్‌ఫామ్‌ల పొడవు ఒకేలా ఉండదు. 24 కోచ్‌లు ఉండే ఎక్స్‌ప్రెస్ రైలుకు పొడవైన ప్లాట్‌ఫామ్ కావాలి, అదే మెము లేదా ప్యాసింజర్ రైళ్లకు చిన్న ప్లాట్‌ఫామ్ సరిపోతుంది. అలాగే గూడ్స్ రైళ్లకు వాటి పొడవును బట్టి ప్రత్యేకమైన లూప్ లైన్లు లేదా ప్లాట్‌ఫామ్‌లను కేటాయిస్తారు.

ఈ ఆపరేషన్లన్నీ స్టేషన్ మాస్టర్, సెక్షన్ కంట్రోలర్ పర్యవేక్షణలో జరుగుతాయి. వీటితో పాటు ఇంటర్లాకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ సిగ్నలింగ్ లాంటి సాంకేతిక అంశాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. మన రైల్వే వ్యవస్థ ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో చెప్పడానికి ఈ మేనేజ్‌మెంట్ ఒక గొప్ప ఉదాహరణ.

ఇది చదవండి: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.? ఇది చాలామందికి తెలియదు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us