AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Buy: ఇల్లు ఇలా కొన్నారనుకోండి.! అప్పుల పాలు అయిపోతారు.. ఇది తెలియక చాలామంది..

ఉద్యోగం రాగానే ఇల్లు కొనడం మంచిదేనా? భారీ ఈఎంఐలు మీ కెరీర్ ఎదుగుదలను దెబ్బతీస్తాయా? బెంగళూరు లాంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ లాభాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆర్థిక నిపుణులు ఇంటి కొనుగోలుకు సంబంధించి యువతకు ఇస్తున్న విలువైన సలహాలు ఈ కథనంలో..

Home Buy: ఇల్లు ఇలా కొన్నారనుకోండి.! అప్పుల పాలు అయిపోతారు.. ఇది తెలియక చాలామంది..
House
Ravi Kiran
|

Updated on: May 08, 2026 | 9:37 AM

Share

నేటికాలంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం లేదా ఇతర స్థిరమైన ఉద్యోగం రాగానే చాలామంది చేసే మొదటి పని హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేయడం. అయితే, ఇది ఎల్లప్పుడూ సరైన నిర్ణయం కాకపోవచ్చని బిజినెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇల్లు కొనడం అనేది కేవలం ఒక డ్రీమ్ మాత్రమే కాదు, అది ఒక పెద్ద ఆర్థిక బాధ్యత. అందుకే అఫోర్డబిలిటీ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. కెరీర్ ప్రారంభంలోనే భారీ ఈఎంఐ భారం నెత్తి మీద వేసుకుంటే, అది మీ స్వేచ్ఛను హరిస్తుంది.

ఉదాహరణకు, మీకు బెటర్ శాలరీతో వేరే సిటీలో ఆఫర్ వచ్చినా లేదా ఉద్యోగం వదిలేసి ఏదైనా కొత్తగా చేయాలన్నా ఈ ఈఎంఐలు మీకు అడ్డుగోడలా మారుతాయి. మీ శాలరీలో 30 శాతం నుండి గరిష్టంగా 40 శాతం మించి ఈఎంఐ ఉండకూడదని సూచించారు. ఒకవేళ మీ శాలరీ రూ. 1 లక్ష అయితే, మీ ఈఎంఐ రూ. 40 వేలు దాటకూడదు. ఈ ప్రాథమిక సూత్రం పాటిస్తే మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే అది మీ ఆర్థిక భద్రతను ప్రమాదంలో పడేస్తుంది.

అయితే, బాగా అభివృద్ధి చెందుతున్న ఏరియాలలో ఇల్లు కొనడం వల్ల లాభం కూడా ఉంటుంది. ఏ ఏరియాల్లో భూమి రేట్లు వేగంగా పెరుగుతాయో గమనించి ఇన్వెస్ట్ చేస్తే, అద్భుతమైన ప్రాపర్టీ అప్రిసియేషన్ పొందవచ్చని చెబుతున్నారు. మీకు 20 శాతం నుండి 40 శాతం వరకు డౌన్ పేమెంట్ చేసే అవకాశం ఉండి, మీరు ఉంటున్న సిటీలోనే పర్మనెంట్‌గా ఉండాలనుకుంటే ఇల్లు కొనడం మంచిదే. కానీ కేవలం సమాజం కోసం లేదా సెంటిమెంట్ కోసం అప్పుల ఊబిలోకి వెళ్లడం సరికాదు. కెరీర్ మధ్యలో, అంటే 30-35 ఏళ్ల వయస్సులో ఇల్లు కొనడం మరింత తెలివైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పటికి మీ ఆర్థిక స్థితి, కెరీర్‌పై మీకు పూర్తి అవగాహన వస్తుంది.

Follow Us
ఇల్లు ఇలా కొన్నారనుకోండి.! అప్పుల పాలు అయిపోతారు..
ఇల్లు ఇలా కొన్నారనుకోండి.! అప్పుల పాలు అయిపోతారు..
ఆ సినిమాలో చిరంజీవి హీరో.. కానీ నాకు 40 సీన్స్ ఇచ్చారు..
ఆ సినిమాలో చిరంజీవి హీరో.. కానీ నాకు 40 సీన్స్ ఇచ్చారు..
ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌! లక్షణాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌! లక్షణాలు
పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ
పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ
ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..
ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..
మీకు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు
మీకు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు
ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..
ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..
పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌
పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద