AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్వాడీస్ బిజినెస్ సీక్రెట్ ఇదే.. ఈ లాజిక్ తెలిస్తే 3 ఏళ్లలో 30 కోట్లు సంపాదిస్తారు.!

ప్రపంచవ్యాప్తంగా మర్వాడీలు వ్యాపార సామ్రాజ్యాలను ఎలా నిర్మించగలిగారు? వారి ఆర్థిక క్రమశిక్షణ వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పే లెక్కల ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో.. ఆ వివరాలు ఇలా..

మార్వాడీస్ బిజినెస్ సీక్రెట్ ఇదే.. ఈ లాజిక్ తెలిస్తే 3 ఏళ్లలో 30 కోట్లు సంపాదిస్తారు.!
Marwadi Business Secret
Ravi Kiran
|

Updated on: May 07, 2026 | 1:28 PM

Share

మనం ఏ పట్టణానికి వెళ్లినా, ఏ సంతకు వెళ్లినా అక్కడ పెద్ద పెద్ద హోల్‌సేల్ వ్యాపారాలు, హార్డ్‌వేర్ షాపులు, లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బిజినెస్‌లలో మర్వాడీలు కనిపిస్తుంటారు. అసలు వీరు ఏ ఊరు వెళ్లినా అక్కడ వ్యాపారాన్ని ఎలా సక్సెస్ చేయగలుగుతారు? దీనిపై బిజినెస్ నిపుణులు చేసిన విశ్లేషణ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. మర్వాడీల విజయం వెనుక కేవలం అదృష్టం లేదు, దశాబ్దాల తరబడి వారు పాటిస్తున్న కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి.

మొదటి రహస్యం.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. మర్వాడీలు ఇప్పటికీ కుటుంబం అంతా కలిసి ఉండటానికే మొగ్గు చూపుతారు. “సంఘే శక్తి కలౌ యుగే” అన్నట్లుగా, కుటుంబం అంతా కలిసి ఒకే మాట మీద ఉండటం వల్ల వారి ఆర్థిక శక్తి పెరుగుతుంది. వంద మంది విడివిడిగా బతకడం కంటే, వంద మంది కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయడం వల్ల కలిగే లాభం అపారమని వారు నమ్ముతారు. అందుకే వారిలో ఒకరికి కష్టం వచ్చినా, మిగిలిన వారందరూ అండగా నిలబడి ఆ వ్యాపారాన్ని కాపాడతారు.

రెండో రహస్యం.. చిన్నతనం నుండే ఆర్థిక విద్య. మర్వాడీల ఇళ్లలో పిల్లలకు మాటలు రాకముందే లెక్కలు నేర్పుతారు. ఒక చిన్న చాక్లెట్ లేదా బ్యాట్ కొనిచ్చినా, దాన్ని డైరీలో నోట్ చేయాలని తాతలు, తండ్రులు పట్టుబడతారు. తేదీ, సమయం, ఎంత ఖర్చు అయింది, ఎందుకు ఖర్చు అయింది అనే వివరాలు రాయడం వల్ల పిల్లలకు డబ్బు విలువ తెలుస్తుంది. “ఖర్చు చేసేటప్పుడు ప్రేమ ఉండాలి, కానీ రాసేటప్పుడు లెక్క ఖచ్చితంగా ఉండాలి” అనేది వారి సూత్రం.

మూడోది.. వ్యాపార నిబద్ధత. సికింద్రాబాద్ సిటిసి లాంటి కంప్యూటర్ మార్కెట్ నుండి బట్టల వ్యాపారం వరకు ప్రతిచోటా వారు జట్టుగా పనిచేస్తారు. ఒకరి వ్యాపారానికి మరొకరు తోడవుతారు కానీ పోటీ పడరు. అలాగే, వారు తమ ఆదాయంలో కొంత భాగాన్ని నిరంతరం రీ-ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. విలాసాల కంటే వ్యాపారాన్ని విస్తరించడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఉమ్మడి కుటుంబంలోని డబ్బును ఒక పూల్ లాగా మార్చి, దానితో పెద్ద పెద్ద వెంచర్లు లేదా స్థలాలు కొనుగోలు చేసి లాభాలను ఆర్జిస్తారు. మర్వాడీల ఈ మనీ మేనేజ్‌మెంట్ సూత్రాలు పాటిస్తే ఎవరైనా ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.

Follow Us