Houses Demand: దేశంలో ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌.. ఎందుకంటే..

లక్షలాది మంది అద్దె ఇళ్ళలో నివసించే వారికి.. సరసమైన గృహాలను పొందాలనుకోవడం వారి మొదటి ఆప్షన్‌ గా ఉంటుంది. పెద్ద నగరాల్లో 60 చదరపు మీటర్ల వరకు కార్పేట్ ఏరియాతో 45 లక్షల రూపాయల..

Houses Demand: దేశంలో ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌.. ఎందుకంటే..
Real Estate

Updated on: Feb 24, 2023 | 5:40 PM

లక్షలాది మంది అద్దె ఇళ్ళలో నివసించే వారికి.. సరసమైన గృహాలను పొందాలనుకోవడం వారి మొదటి ఆప్షన్‌ గా ఉంటుంది. పెద్ద నగరాల్లో 60 చదరపు మీటర్ల వరకు కార్పేట్ ఏరియాతో 45 లక్షల రూపాయల వరకు ఉండే ఇళ్లు, సరసమైన గృహాల పరిధిలోకి వస్తాయి. హౌసింగ్ రంగానికి బడ్జెట్‌లో ఏమీ ప్రతిపాన లేదు. అంతే కాదు మొదటిసారి ఇల్లు కొనాలనుకునే వారికి కూడా ఎలాంటి ఉపశమనం లభించలేదు. గృహ రుణ వడ్డీపై మినహాయింపు పరిమితి కూడా పెరగలేదు. అలాగే సరసమైన గృహాల ధరల విషయంలో ఎలాంటి ప్రకటనలు రాలేదు. మరిన్ని రకాల ఇళ్లు సరసమైన గృహాల పరిధిలోకి తెచ్చినట్లయితే గృహ కొనుగోలుదారులు జీఎస్టీ ఉపశమనం పొందే అవకాశం ఉండేది.

ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ప్రకారం.. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 2022 జూలై-డిసెంబర్ కాలంలో 1,53,961 ఇళ్లు విక్రయాలు జరిగాయి. ఇందులో 50 లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న ఇళ్ల వాటా 35 శాతం అంటే 53,886. 2021 అదే కాలంలో మొత్తం 1,33,487 ఇళ్లు విక్రయాలు జరిగాయి. అందులో 50 లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న ఇళ్ల వాటా 42 శాతం అంటే 56,064. ఈ నగరాల్లో ముంబై, NCR, బెంగళూరు, పూణే, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్ ఉన్నాయి.

అయితే ఎన్‌సిఆర్‌లో 2022లో జూలై నుంచి డిసెంబర్ వరకు మొత్తం 29,359 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇందులో 50 లక్షల రూపాయల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా 20 శాతం అంటే 5,871. ఒక సంవత్సరం క్రితం విక్రయించిన 23,599 ఇళ్లలో దాని వాటా 27% అంటే 6,371 ఇళ్లు. మొత్తం గృహాల విక్రయాలు పెరిగిపోయాయి. కానీ అందుబాటు ధరలో ఉండే ఇళ్ల వాటా తగ్గిపోయింది. 2020లో కూడా అదే జరిగింది. ఖరీదైన గృహాలు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతుండగా, సరసమైన గృహాలను కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి మహమ్మారి బారిన పడిన వ్యక్తులు అంతకుముందు తక్కువ ధరల్లో గృహాలను ఎక్కువగా కొనుగోలు చేసేవారు. సంక్షోభం కారణంగా ఈ వ్యక్తులు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఇల్లు కొనుక్కోవడానికి వారి దగ్గర సరిపడా డబ్బు లేదు. అందుబాటు గృహాల వాటా రోజురోజుకూ తగ్గిపోవడానికి ఇదే కారణం కావచ్చు. తక్కువ ధరల్లో గృహాలను కొనుగోలు చేయగల ధైర్యాన్ని చేసిన వ్యక్తులు కరోనా వైరస్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎలాగైనా తప్పించుకోగలిగారు. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం, ఖరీదైన అప్పుల కారణంగా వారు సవాళ్లను ఎదుర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వివిధ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు మాత్రమే విక్రయిస్తున్నారు. అందుకే మార్కెట్‌లో వ్యాపారం కూడా పడిపోతోంది. దీని ప్రకారం 2018 సంవత్సరంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో కొత్త ఇళ్ల మార్కెట్‌ 1,95,300 యూనిట్లుగా ఉంది. అందుబాటు ధరలో హౌసింగ్ దానిలో 40 శాతం వాటాను కలిగి ఉంది. 2022లో 3,57,650 గృహాల మొత్తం విక్రయాలలో స్థోమత కలిగిన గృహాల వాటా 20 శాతం మాత్రమే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి