Honor V40 5G: ఆనర్‌ నుంచి అద్భుతమైన ఫీచర్స్ డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాతో ‘ఆనర్‌వి40 5జీ మొబైల్‌

|

Jan 30, 2021 | 6:12 AM

Honor V40 5G: ఆనర్‌ నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదైంది. ‘ఆనర్‌ వి40 5జీ’ పేరుతో వచ్చిన ఈ మొబైల్‌ చైనాలో లాంచ్‌ చేసింది. 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనుకవైపు

Honor V40 5G: ఆనర్‌ నుంచి అద్భుతమైన ఫీచర్స్  డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాతో ‘ఆనర్‌వి40 5జీ మొబైల్‌
Follow us on

Honor V40 5G: ఆనర్‌ నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదైంది. ‘ఆనర్‌ వి40 5జీ’ పేరుతో వచ్చిన ఈ మొబైల్‌ చైనాలో లాంచ్‌ చేసింది. 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనుకవైపు కెమెరా హౌసింగ్‌, డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా వంటివి ఉన్నాయి. గత సంవత్సరం ఆనర్‌ వి30 సిరీస్‌కు ఈ ఫోన్‌ను సక్సెసర్‌గా తీసుకొచ్చారు. మీడియా టెక్‌ డైమెన్సిటీ 1000 ప్లస్‌ ఎస్‌ఓసీ చిప్‌సెట్‌, 4,200ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్నాయి.

ఆనర్‌ వి40 5జీ 8జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజీ మోడల్‌ ధర దాదాపు రూ.40,600 ఉండే అవకాశం ఉంది. 8జీబీ+256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.45,100 ఉంది. మేజిక్‌ నైట్‌ బ్లాక్‌, రోజ్‌గోల్డ్‌, టైటానియం సిల్వర్‌ కలర్‌లలో అందుబాటులో ఉంది.

కాగా, 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఓలెడ్‌ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 11 మేజిక్‌ యూఐ 4.0 ఓఎస్‌, 8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజీ వేరియంట్లు ఉన్నాయి. అలాగే మీడియాటెక్‌ డైమెన్సిటీ 1000 ప్లస్‌ ఎస్‌ఓసీ చిప్‌సెట్‌, వెనుక భాగంలో 50 ఎంపీ సెన్సార్‌తో నాలుగు కెమెరాలు, ముందువైపు 16 ఎంపీ సెన్సార్‌తో రెండు కెమెరాలు ఉన్నాయి. ఇక 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 66 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, 50 వాట్స్‌ వైర్‌లెస్‌ చార్జింగ్‌ సపోర్టు చేయనుంది.ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి.

Xiaomi: సరికొత్త ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసిన షియోమీ… చూస్తే అవాక్కవ్వాల్సిందే..