Car Offers: హోండా కార్లపై రూ. 1.14లక్షల వరకూ తగ్గింపు.. అన్ని మోడళ్లపైనా ప్రయోజనాలు..

|

Sep 04, 2024 | 5:55 PM

పండుగలకు వారం ముందుగానే హెూండా కార్ ఇండియా తమ ఉత్పత్తులపై అదిరే తగ్గింపు ధరలను అందిస్తోంది. హోండా అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి మోడళ్లతో పాటు మొత్తం ఉత్పత్తి పోర్ట్ ఫోలియోలోని అన్ని కార్లపై నగదు తగ్గింపులు, ఇతర ప్రయోజనాలను ప్రకటించింది. దాదాపు రూ. 114,000 వరకు తగ్గింపులు అమలు చేస్తోంది.

Car Offers: హోండా కార్లపై రూ. 1.14లక్షల వరకూ తగ్గింపు.. అన్ని మోడళ్లపైనా ప్రయోజనాలు..
Honda City
Follow us on

పండుగల సీజన్‌ సమీపించింది. ఈ వారాంతంలో వినాయకచవితితో మొదలు, దసరా, దీపావళి వరకూ నెల వ్యవధిలో అంతటా పండుగ శోభ వెల్లివిరుస్తుంది. అదే సమయంలో వివిధ కంపెనీలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ప్లాట్‌ ఫాంలు ఫెస్టివల్‌ సేల్స్‌ నిర్వహిస్తాయి. అన్ని రంగాల్లోనూ ఈ ఆఫర్ల జాతర కొనసాగుతుంది. వాహన రంగంలోనూ ఇదే ట్రెండ్‌ ఉంటుంది. వినియోగదారులకు ఆకర్షించేందుకు అనేక వాహన తయారీదారులు భారీ తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తుంటారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ ఆఫర్ల జాతరను షురూ చేశాయి. పండుగలకు వారం ముందుగానే హెూండా కార్ ఇండియా తమ ఉత్పత్తులపై అదిరే తగ్గింపు ధరలను అందిస్తోంది. హోండా అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి మోడళ్లతో పాటు మొత్తం ఉత్పత్తి పోర్ట్ ఫోలియోలోని అన్ని కార్లపై నగదు తగ్గింపులు, ఇతర ప్రయోజనాలను ప్రకటించింది. దాదాపు రూ. 114,000 వరకు తగ్గింపులు అమలు చేస్తోంది.

ఆఫర్లు ఇలా..

జపనీస్ కార్ తయారీదారు అయిన హోండా పండుగల సీజన్‌ను అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది.అందుకోసం తగ్గింపులు, ఇతర ‍ప్రయోజనాలను ప్రకటించింది. హోండా సిటీ మిడ్‌ సైజ్‌ సెడాన్‌పై రూ. 114,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. హోండా సిటీ సెడాన్ అన్ని వేరియంట్లపైనా ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఓఈఎం ఈ కారుతో ప్రామాణికంగా మూడేళ్ల ఉచిత నిర్వహణ ప్యాకేజీని అందిస్తోంది. అయితే, క్యాష్ డిస్కౌంట్ స్పెక్ట్రమ్ ఎంత అనేది వెల్లడించలేదు. ఐదో తరం హోండా సిటీ ధర రూ. 12,08,100 (ఎక్స్- షోరూమ్ ) నుంచి ప్రారంభమవుతుంది.

హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ రూ.1,12,000 వరకు విలువైన ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. ఇందులో నగదు తగ్గింపుతో పాటు మూడు సంవత్సరాల ఉచిత నిర్వహణ ప్యాకేజీ ఉంటుంది. అంతేకాక అమేజ్ ప్రారంభ ధర ను కంపెనీ రూ. 30,000 తగ్గించింది. దీంతో ఈ సెడాన్ ఇప్పుడు రూ. 7,62,800 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ‘ఈ’ వేరియంట్‌పై రూ. 82,000 వరకు ‘ఎస్‌’ వేరియంట్‌పై రూ. 92,000 వరకు ప్రయోజనాలను పొందుతుంది. హెూండా అమేజ్ వీఎక్స్‌, ఎలైట్ వేరియంట్ల అత్యధిక ప్రయోజనాలలు అందుబాటులో ఉన్నాయి.

హోండా సిటీ ఈ:హెచ్‌ఈవీ మోడల్‌పై రూ. 90,000 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉంది, ఇందులో మూడు సంవత్సరాల ఉచిత నిర్వహణ ప్యాకేజీ ఉంటుంది. ఈ హైబ్రిడ్ సెడాన్ ధర రూ. 20,55,100 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. హెూండా ఎలివేట్, భారతదేశంలో ఈ బ్రాండ్ నుంచి విక్రయించబడుతున్న ఏకైక ఎస్‌యూవీ. మూడు సంవత్సరాల పాటు ఉచిత నిర్వహణ ప్యాకేజీతో సహా రూ. 75,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. హోండా ఎలివేట్ ధర రూ.11.91 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..