Honda Electric SUV: హోండా ఎలక్ట్రిక్ SUV రాబోతుంది! డిజైన్, ఫీచర్లు సూపర్!

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా మోటార్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్‌ ఎలక్ట్రిక్‌ SUV రాబోతోంది. ఇటీవల జరిగిన జపాన్‌ మొబిలిటీ షోలో హోండా దీనికి సంబంధించిన కాన్సెప్ట్‌ మోడల్‌ను ప్రదర్శించింది. మరి ఈ SUV డిజైన్ ఇంకా ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Honda Electric SUV: హోండా ఎలక్ట్రిక్ SUV రాబోతుంది! డిజైన్, ఫీచర్లు సూపర్!
Honda Electric Suv

Updated on: Oct 29, 2025 | 3:46 PM

హోండా డెవలప్ చేసిన సరికొత్త ఎలక్ట్రిక్ SUV 2027  ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. అంతేకాదు, 2050 నాటికి తమ ఉత్పత్తులన్నీ కార్బన్‌ న్యూట్రల్‌గా మార్చడమే లక్ష్యమని హోండా కంపెనీ చెప్తోంది. అందులో భాగంగానే మొదటి అడుగుగా ఈ SUVని రంగంలోకి దింపుతోంది. ఇక SUV విషయానికొస్తే దీనికి  హోండా జీరో ఆల్ఫా(Honda 0 α) అని పేరు పెట్టారు. దీని స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే..

స్పెసిఫికేషన్లు..

హోండా జీరో ఆల్ఫా లో 19 అంగుళాల షార్ప్ డిజైన్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ కారులో 65kwh, 75 kwh రెండు బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. లిథియం ఐరన్ పాస్ఫేట్(LFP) టెక్నాలజీతో ఈ రెండు బ్యాటరీలు నడుస్తాయి. ఈ టెక్నాలజీ వల్ల వేడి వాతావరణంలో కూడా బ్యాటరీ పాడవ్వదు. ఈ SUV ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌తో వస్తుంది. వీల్‌బేస్‌ 2700-2800mm మధ్యన ఉండొచ్చు.

ధర ఎంతంటే..

ఇకపోతే ఈ కారు చాలా ఫ్యూచరిస్టిక్‌ డిజైన్ తో ఉంటుంది. షార్ప్ ఎడ్జెస్ తో పాటు ఇల్యుమినేటెడ్ లోగో ఉంటుంది. ఇక ధరల విషయానికొస్తే..  హోండా జీరో ఆల్ఫా SUV ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఇది త్వరలో రాబోయే మారుతి విటారా ఎలక్ట్రిక్, మహింద్రా BE 6, టాటా Curvv EV, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV వంటి వాహనాలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.