కారు ఫిచర్లతో వస్తున్న స్కూటర్‌.. ! ధర కూడా చాలా తక్కువ.. ఇవీ పూర్తి వివరాలు..

|

Jun 10, 2023 | 12:06 PM

ఇప్పుడు కంపెనీ తన హోండా డియో స్కూటర్‌కు అదే ఫీచర్‌ను జోడించబోతోంది. ఈ మేరకు కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో డియో హెచ్ స్మార్ట్ ధరను ప్రకటించింది. దీని ప్రకారం స్కూటర్ బేస్ మోడల్ ధర కూడా మీకు అందుబాటులోనే ఉంది.. తెలిస్తే మాత్రం ఎగిరి గంతేస్తారు.. ఇప్పుడే ఆర్డర్ చేసేస్తారు..

కారు ఫిచర్లతో వస్తున్న స్కూటర్‌.. ! ధర కూడా చాలా తక్కువ.. ఇవీ పూర్తి వివరాలు..
Honda Dio
Follow us on

మీరు కొత్తగా బైక్‌ కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే, మీకో గుడ్‌న్యూస్‌.. హోండా ఇప్పుడు సరికొత్త ఫిచర్లతో కొత్త బైక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్‌ మీకు కారు లాంటి ఫిచర్లను అందిస్తుంది. హోండా తన యాక్టివా స్కూటర్‌లో హెచ్-స్మార్ట్ వేరియంట్‌ను కొంతకాలం క్రితం భారత మార్కెట్లో విడుదల చేసింది. H-Smart సిరీస్ కింద స్కూటర్‌కి స్మార్ట్ కీ ఫీచర్‌ని జోడించింది.. ఇప్పుడు కంపెనీ తన హోండా డియో స్కూటర్‌కు అదే ఫీచర్‌ను జోడించబోతోంది. ఈ మేరకు కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో డియో హెచ్ స్మార్ట్ ధరను ప్రకటించింది. దీని ప్రకారం స్కూటర్ బేస్ మోడల్ ధర రూ.70,211. కొత్త టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.77,712. ప్రస్తుతం, కొత్త హోండా డియో బుకింగ్ కూడా ప్రారంభమైంది.

హోండా డియో ఫీచర్లు వెబ్‌సైట్‌లో వెల్లడించలేదు. కానీ, డియో హెచ్-స్మార్ట్ ఫీచర్లు యాక్టివా హెచ్-స్మార్ట్ మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు. అంటే, ఇది ఇంధన సామర్థ్యం గల టైర్లు, స్మార్ట్ కీతో వస్తుంది. స్మార్ట్ కీతో పాటు, ఈ స్కూటర్‌లో యాంటీ థెఫ్ట్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ ఫీచర్‌తో స్కూటర్ 2 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. మీటరు కంటే ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు స్కూటర్‌ను లాక్ చేస్తుంది.

స్కూటర్ హ్యాండిల్, ఫ్యూయెల్ క్యాప్, సీటు కీ దగ్గర ఉన్న వెంటనే అన్‌లాక్ చేయవచ్చు. ఇగ్నిషన్‌ను ఆన్ చేయడానికి, రోటరీ నాబ్‌ను తిప్పాలి.. ఇంజిన్‌ను స్విచ్ ద్వారా స్టార్ట్‌ చెయొచ్చు, ఆపేయొచ్చు. ఇది LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, LED హెడ్‌ల్యాంప్, ఫ్రంట్ పాకెట్, అండర్ సీట్ స్టోరేజ్, ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, పాసింగ్ స్విచ్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్ ఉన్నాయి .

ఇవి కూడా చదవండి

పవర్ డియో హెచ్-స్మార్ట్ కూడా యాక్టివాతో అందించబడిన అదే 109.51 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను అందిస్తుంది.. ఇది 8,000 rpm వద్ద 7.65 bhp, 4,750 rpm వద్ద 9 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సస్పెన్షన్, బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో ఎటువంటి మార్పు ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి