Honda Bike: హోండా నుంచి విడుదల కానున్న మరో సరికొత్త బైక్‌.. అత్యాధునిక ఫీచర్లతో బైక్‌ తయారీ

|

May 28, 2021 | 4:17 PM

Honda Bike: జపాన్‌కు చెందిన హోండా కంపెనీ కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు రోజురోజుకు కొత్త కొత్త మోడళ్లలో బైక్‌లను విడుదల చేస్తోంది. మరో సరికొత్త ఫీచర్స్‌తో..

Honda Bike: హోండా నుంచి విడుదల కానున్న మరో సరికొత్త బైక్‌.. అత్యాధునిక ఫీచర్లతో బైక్‌ తయారీ
Follow us on

Honda Bike: జపాన్‌కు చెందిన హోండా కంపెనీ కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు రోజురోజుకు కొత్త కొత్త మోడళ్లలో బైక్‌లను విడుదల చేస్తోంది. మరో సరికొత్త ఫీచర్స్‌తో వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది. హోండా మోటార్స్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా లిమిటెడ్‌, ప్రీమియం మోటార్స్‌ సైకిల్‌ విభాగంలో మరో కొత్త ఎంట్రీ లెవల్‌ మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ బిఎస్6లో కంపెనీ ఇప్పటికే హైనెస్ సిబి350 , సిబి350ఆర్ఎస్ అనే రెండు ప్రీమయం మోటార్‌సైకిళ్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ కంపెనీ కొత్తగా హోండా సిబి300ఆర్ అనే ఎంట్రీ లెవల్ ప్రీమియం బైక్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక ఒకవేళ హోండా తమ సిబి300ఆర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో ప్రారంభించాలని నిర్ణయించుకుంటే, అది బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారానే అమ్మటం జరుగుతుందని తెలుస్తోంది. ఇక హోండా బిఎస్4 వెర్షన్‌లో వాడిన అదే ఇంజన్‌ను కంపెనీ బిఎస్6 కాలుష్య నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఇందులో ఉపయోగించనుందని తెలుస్తోంది.

అయితే మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ అప్‌గ్రేడెడ్ ఇంజన్ పవర్ ,టార్క్ గణాంకాల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. ఇక బిఎస్ 4 మోటార్‌సైకిల్‌లో 286సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను వాడారు. ఈ ఇంజన్ ఎక్కువగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 31.4 బిహెచ్‌పి శక్తిని 6500 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మిక్స్ అయ్యి ఉంటుంది. 300సీసీ బైక్ ధర సుమారు రూ.2.41 లక్షలు, (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంటుందని అంచనా.

ఇవీ కూడా చదవండి:

Lenovo: లెనోవో నుంచి కొత్త ట్యాబ్‌లు.. మార్కెట్లో విడుదల.. ధర ఫీచర్స్‌ వివరాలు ఇవే..!

SBI KYC: కేవైసీ చేయకపోతే మీ బ్యాంకు ఖాతా బ్లాక్‌ చేస్తామని మెసేజ్‌లు వస్తున్నాయా? ఎస్‌బీఐ ఏం చెబుతోంది