Stock Market: ఈ స్టాక్‌ల్లో పెట్టుబడి పెడితే లాభామేనా.. బ్రోకరేజ్ సంస్థలు ఏం చెబుతున్నాయి..

|

Mar 18, 2022 | 4:59 PM

స్టాక్‌ మార్కెట్‌(Stock Market)లో పెట్టుబడి పెట్టేవారు క్రమంగా పెరుగుతున్నారు. అయితే రిటైల్‌ పెట్టుబడిదారుల(Retail Investers)కు ఎలాంటి స్టాక్‌ల్లో పెట్టుబడి పెట్టాలో తెలియదు.

Stock Market: ఈ స్టాక్‌ల్లో పెట్టుబడి పెడితే లాభామేనా.. బ్రోకరేజ్ సంస్థలు ఏం చెబుతున్నాయి..
Stock Market
Follow us on

స్టాక్‌ మార్కెట్‌(Stock Market)లో పెట్టుబడి పెట్టేవారు క్రమంగా పెరుగుతున్నారు. అయితే రిటైల్‌ పెట్టుబడిదారుల(Retail Investers)కు ఎలాంటి స్టాక్‌ల్లో పెట్టుబడి పెట్టాలో తెలియదు. ఎందుకంటే వారు పెట్టుబడి పెట్టే కంపెనీల గురించి విశ్లేషణ చేయలేరు. అయితే వారు నిపుణుల సలహా తీసుకోవాలి. మీ పోర్ట్‌పోలియోను ఎప్పకప్పుడు కనిపెట్టుకుని ఉండాలి. మీరు పెట్టుబడి పెట్టిన కంపెనీల అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలాగే బ్రోకరేజ్‌ల అనాలసిస్‌ను కూడా గమనించాలి. ఇలా ఐదు భిన్న రంగాలకు చెందిన స్టాక్‌ల గురించి బ్రోకరేజ్ సంస్థలు పలు సూచనలు చేశాయి. అవి ఏమింటో చూద్దాం..

శ్యామ్ మెటాలిక్స్

ICICI సెక్యూరిటీస్ మెటల్ సెక్టార్‌కి చెందిన శ్యామ్ మెటాలిక్స్ & ఎనర్జీలో రూ.400 టార్గెట్‌తో ఇన్వెస్ట్‌మెంట్ సలహా ఇచ్చింది. ప్రస్తుతం స్టాక్ రూ.347గా ఉంది. అంటే ఇక్కడ నుంచి ఈ స్టాక్ 15 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా. కంపెనీ తన క్యాపెక్స్‌ను పెంచే ప్రణాళికను ప్రకటించిందని బ్రోకింగ్ సంస్థ చెప్పింది. దాని ఉత్పత్తి సామర్థ్యంలో పెరుగుదల కనిపిస్తుందని.. ఇది కంపెనీకి మరింత ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంది.

గోద్రెజ్ అగ్రోవెట్

రూ.692 లక్ష్యంతో వ్యవసాయ రంగ సంస్థ గోద్రెజ్ అగ్రోవెట్‌లో పెట్టుబడులు పెట్టాలని మోతీలాల్ ఓస్వాల్ వారు సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఈ షేరు రూ. 477 గా ఉంది. అంటే ఇక్కడి నుంచి షేరు 45 శాతం పెరగొచ్చని చూడవచ్చుని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.

స్టార్ హెల్త్

మోతీలాల్ ఓస్వాల్ బీమా రంగానికి చెందిన స్టార్ హెల్త్‌లో రూ.750 టార్గెట్‌తో పెట్టుబడి సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఈ షేరు రూ. 638 వద్ద ఉంది. అంటే, ఇక్కడి నుంచి స్టాక్ 17 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా. దేశంలో ఆరోగ్య బీమా గురించి అవగాహన పెరుగుతోందని బ్రోకింగ్ సంస్థ తెలిపింది. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న స్టార్ హెల్త్ దాని నుండి పూర్తిగా ప్రయోజనం పొందుతుందని అంచనా వేస్తోంది.

భారత్ ఎలక్ట్రానిక్స్

రూ.254 లక్ష్యంతో రక్షణ రంగానికి చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్‌లో షేర్‌ఖాన్ పెట్టుబడి సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఈ షేరు రూ.209 స్థాయి వద్ద ఉంది. అంటే ఇక్కడి నుంచి స్టాక్ 21 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా.

HDFC బ్యాంక్

రూ.1973 టార్గెట్‌తో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో పెట్టుబడి పెట్టాలని షేర్‌ఖాన్ సూచించింది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.1480 గా ఉంది. అంటే షేరులో 33 శాతానికి పైగా పెంపుదల ఉంటుందని అంచనా. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుపై ఆంక్షలను ఎత్తేసింది.

Note: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్నది. పెట్టుబడి సలహా బ్రోకరేజ్ సంస్థలు అందించిన సమాచారం మాత్రమే. ఆర్థిక, స్టాక్‌ మార్కెట్ నిపుణులతో చర్చిన తర్వాతే పెట్టుబడిపై ఆలోచించండి.

Read Also.. Credit Card: విదేశీ ప్రయాణాలకు క్రెడిట్ కార్డు.. కార్డు ఎంపికలో ఈ విషయాలు గమనించాల్సిందే..