
బంగారం ధర రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,290(10 గ్రాములు)కి చేరుకుంది. అలాగే కిలో వెండి ధర సుమారు రూ. 1,56,200 ఉంది. అయితే ఇవే బంగారం ధరలు ఒకప్పుడు కేవలం వందల రూపాయల్లో ఉండేవని మీకు తెలుసా? సరిగ్గా వందేళ్ల క్రితం అంటే 1925 నుంచి బంగారం ధరలు ఎలా మారుతూ వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.
స్వాతంత్రం రాకముందు మన దగ్గర బంగారం కోకొల్లలు గా ఉండేది. అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మొత్తంలో ఎక్కువగా బంగారాన్ని వాడే దేశం మనదే. అందుకే అప్పట్లో బంగారం చాలా తక్కువ ధరకే దొరికేది 1925లో పది గ్రాముల బంగారం ధర రూ.18 ఉండేది. ఇది 1935 నాటికి రూ. 30 కి చేరుకుంది. ఆ తర్వాత 1940లో రూ.36 ఉండేది. ఇది స్వాతంత్రం వచ్చే నాటికి అంటే1945 లో రూ. 62కి చేరుకుంది. ఆ తర్వాత ఎలా మారుతూ వచ్చిందంటే..
1950 నాటికి రూ.99
1951 నాటికి రూ.79
1960 నాటికి రూ.111
1965 నాటికి రూ. 71
1970 నాటికి రూ.184
1975 నాటికి రూ.540
1980 నాటికి రూ.1330
1985 నాటికి రూ. 2310
1990 నాటికి రూ. 3200
1995 నాటికి రూ 4658
2000 నాటికి రూ.4,395
2005 నాటికి రూ.7,680
2008 నాటికి రూ.12,500
2010 నాటికి రూ.18,500
2015 నాటికి రూ.26,845
2020 నాటికి రూ. 48,480
2022 నాటికి రూ.53,000
2023 నాటికి రూ.60,000
2024 నాటికి రూ.80,000 గా ఉండేది.
ఇక ఇప్పుడు 2025 నాటికి రూ.1,23,460 గా ఉంది. ఇలా బంగారం ధరల్లో ప్రతి పదేళ్లకు భారీగా మార్పులు వస్తూ వచ్చాయి. అయితే ఇకపై కూడా ధరలు పెరగడమే కానీ తగ్గవని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాల క్రమేణా బంగారం, వెండికి అంతర్జాతీయంగా విలువ పెరుగుతూ పోతుంది. రాబోయే రెండు మూడేళ్లలోనే బంగారం ధర రూ. 2 లక్షల(పది గ్రాములు) మార్క్ కూడా దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..