Ambassador car: ఆ రాజసం మళ్లీ వచ్చేస్తోంది.. అంబాసిడర్ కొత్త లుక్‌ ఎలా ఉండనుందంటే

|

May 13, 2024 | 7:52 AM

1957 నుంచి 2014 వరకు అంబాసిడర్‌ కార్ల హవా కొనసాగింది. హిందుస్థాన్‌ మోటార్స్‌ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ కార్లు ఆ తర్వాత మారుతున్న కాలంతో మాటు అప్‌డేట్‌ అవ్వలేదు దీంతో వీటి అమ్మకాలు భారీ తగ్గాయి. ఈ కారణంగానే కంపెనీ కార్లను ఉత్పత్తి చేయడం ఆపేసింది. అయితే ప్రస్తుతం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అంబాసిడర్‌ మళ్లీ తిరిగి ఆటో మొబైల్‌ రంగంలోకి..

Ambassador car: ఆ రాజసం మళ్లీ వచ్చేస్తోంది.. అంబాసిడర్ కొత్త లుక్‌ ఎలా ఉండనుందంటే
Ambassador Car
Follow us on

అంబాసిడర్.. ఈ తరం వాళ్లకు పెద్దగా ఈ కారు గురించి తెలిసి ఉండదు. కానీ ఒక పాతికేళ్ల క్రితం అంబాసిడర్‌ అంటే ఒక ఐకాన్‌. రాజసానికి గుర్తు. రాజకీయనాయకుడు అంటే కచ్చితంగా అంబాసిడర్‌ కారు ఉపయోగించాల్సిందే. అంతలా పాపులారిటీ సంపాదించిందీ కారు. ప్రస్తుతం రాజకీయనాయకులు రకరకాల కార్లను ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం అందరూ అంబాసిడర్‌ను ఉపయోగించిన వారే.

1957 నుంచి 2014 వరకు అంబాసిడర్‌ కార్ల హవా కొనసాగింది. హిందుస్థాన్‌ మోటార్స్‌ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ కార్లు ఆ తర్వాత మారుతున్న కాలంతో మాటు అప్‌డేట్‌ అవ్వలేదు దీంతో వీటి అమ్మకాలు భారీ తగ్గాయి. ఈ కారణంగానే కంపెనీ కార్లను ఉత్పత్తి చేయడం ఆపేసింది. అయితే ప్రస్తుతం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అంబాసిడర్‌ మళ్లీ తిరిగి ఆటో మొబైల్‌ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈసారి మరింత కొత్తగా, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అప్‌డేట్స్‌తో రానుందని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే అంబాసిడర్‌ తమ కొత్త కార్ల ఉత్పత్తులను సైతం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కారుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సరికొత్త లుక్‌తో, అదిరిపోయే ఫీచర్లతో ఈ కొత్త కారును తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ కొత్త అంబాసిడర్‌ను తిరిగి విడుదల చేయడానికి హిందూస్థాన్ సంస్థ యూరోపియన్ కంపనీతో కలిసి ప్రయత్నాలను వేగవంతం చేసింది. అంబాసిడర్‌లోనే ఈవీని ప్రవేశపెట్టే ఉద్దేశంలోనూ ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

కాగా ఈ కారు ఎప్పుడు మార్కెట్లోకి రానుందన్న దానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ కారును ప్రస్తు అవసరాలకు అనుగుణంగా ఈవీ వేరియంట్‌లో కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఒకప్పుడు ఆటో మొబైల్‌ రంగంలో సంచనలం సృష్టించిన అంబాసిడర్‌ ఇప్పుడు ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..