అదానీ గ్రూప్‌పై ఏడాదిన్నర కిందట సంచలన ఆరోపణలు చేసిన మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్‌బర్గ్.. తాజాగా చేసిన ఆరోపణలు కలకం రేపుతున్నాయి. సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై కాంగ్రెస్ అరాచకాలను, వివాదాన్ని వ్యాప్తి చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం ఆరోపించారు. అదానీ గ్రూప్‌పై చర్య తీసుకోవడానికి క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ విముఖత చూపడానికి సెబీ చైర్మన్ బుచ్, ఆమె భర్త అదానీ గ్రూప్‌తో ముడిపడి ఉన్న విదేశీ నిధుల వాటా కారణంగా అమెరికన్ పరిశోధన, పెట్టుబడి సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు గుప్పించింది.
అదానీ గ్రూప్ అక్రమంగా నిధుల మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్ మాధవి పురి బుచ్, ఆమె భర్త కు వాటాలున్నాయని తాజా రిపోర్ట్‌లో పేర్కొనడం తీవ్ర దుమారం రేపుతోంది. కాగా హిండెన్‌బర్గ్ నివేదికపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భగ్గుమన్నారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశంలో అరాచకం వ్యాప్తి చేయడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని సింధియా దుయ్యబట్టారు. వివాదాస్పద వ్యవహారాల్లో దేశం నలిగిపోవాలని మాత్రమే ఆ పార్టీ కోరుకుంటుందని విమర్శించారు.
#WATCH | Gwalior, Madhya Pradesh: On Hindenburg report, Union Minister and BJP leader Jyotiraditya Scindia says, “Congress has only one work, to spread anarchy in the country and to engage the country in controversial matters. PM Modi and each worker of the BJP are taking India… pic.twitter.com/TQ1rEpnqUI
— ANI (@ANI) August 11, 2024
ఒక వైపు దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ముందు నుంచే కాంగ్రెస్ వైఖరీ ఇదేనని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియడంతో దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అదానీ ఎపిసోడ్‌లో హిండెన్‌బర్గ్ మరొక షాకింగ్ నివేదిక వచ్చింది. ఈ నివేదికలో సెబీ చైర్మన్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆదానీ కంపెనీల్లో మాధబి పురి బచ్‌కు వాటా ఉందని, మారిషస్‌లో సెబీ చీఫ్ మాధబి పురి పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపించడం సంచలన రేపుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి