Wheat Price: పెరుగుతున్న ధరలు.. గోధుమ ధరలకు రష్యాకు ఉన్న సంబంధం ఏమిటి..?

|

Mar 06, 2022 | 11:43 AM

Wheat Price: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (Ukraine-Russia War) ఉధృతంగా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌పై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడిచమురుతో సహా అన్నీ..

Wheat Price: పెరుగుతున్న ధరలు.. గోధుమ ధరలకు రష్యాకు ఉన్న సంబంధం ఏమిటి..?
Follow us on

Wheat Price: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (Ukraine-Russia War) ఉధృతంగా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌పై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడిచమురుతో సహా అన్నీ ఖరీదైనవిగా మారాయి. బంగారం ధరలు 14 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి గోధుమలు కూడా పెరగనున్నా్యి. గత 15 రోజులుగా గోధుమల ధరలు క్వింటాలుకు రూ.85 నుంచి రూ.90 వరకు పెరిగాయి. ఇది గోధుమ పంట కాలం. సాధారణంగా కొత్త పంట మార్కెట్‌లోకి వస్తే గిట్టుబాటు ధర వస్తుంది. కానీ ఇప్పుడు గోధుమల ధరలు (Wheat Price) పెరిగాయి. రానున్న కాలంలో గోధుమల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. యుద్ధం కారణంగా అన్ని స్తంభించిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం రైతులు కొత్త గోధుమలను మార్కెట్‌కు తీసుకురావడం లేదు. మార్కెట్‌లో గోధుమల సరఫరా కంటే డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో గోధుమల ధరలు పెరిగాయి.

రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు:

రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు. గోధుమ ఎగుమతుల్లో ఉక్రెయిన్ మూడో స్థానంలో ఉంది. గత ఏడాది రష్యా ఒక్కటే 35 మిలియన్ టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. దీని తర్వాత 24 మిలియన్ టన్నుల గోధుమ ఎగుమతులతో ఉక్రెయిన్ నిలిచింది. రష్యా, ఉక్రెయిన్ ప్రస్తుతం యుద్ధంలో ఉన్నాయి. యుద్ధం కారణంగా గోధుమల కోసం రష్యా లేదా ఉక్రెయిన్‌పై ఆధారపడే దేశాలకు గోధుమలను సరఫరా చేయడం సాధ్యం కాదు. ఈ దేశాలు ఇప్పుడు గోధుమలను దిగుమతి చేసుకోవడానికి ఇతర దేశాల కోసం చూస్తున్నాయి. ఇది భారత్‌కు గొప్ప అవకాశం. ఎందుకంటే ప్రపంచంలో గోధుమల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. యుద్ధం నేపథ్యంలో గోధుమల ఎగుమతులు పెరగడంతో గోధుమ ధరలు మరింత పెరుగుతాయని రైతులు భావిస్తున్నారు.

భారత్‌కు గోధుమలను ఎగుమతి చేసే అవకాశం:

ప్రపంచంలో గోధుమలను ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలలో భారతదేశం ఒకటి. ప్రస్తుతం భారతదేశంలో కూడా గోధుమల నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఫిబ్రవరి 1 నాటికి భారత్‌లో 2.82 కోట్ల టన్నుల గోధుమల నిల్వలు ఉన్నాయి. భారత్ ఈ ఏడాది 105 మిలియన్ టన్నుల గోధుమలను ఉత్పత్తి చేస్తుందని అంచనా. అంటే దేశ అవసరాలు తీరినా.. ఈ ఏడాది పెద్ద మొత్తంలో గోధుమలు నిల్వ ఉండొచ్చు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ ఏడాది భారత్ నుంచి గోధుమల ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. భారత్ నుంచి ఏటా దాదాపు 50 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది దాదాపు రూ.70 లక్షల వరకు ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine War: ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చిన C-17 విమానం ప్రత్యేకత ఏమిటి..?

Russia-Ukraine War: యుద్ధంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. వీడియో