వివిధ బ్యాంకులు అమలు చేసే ఎఫ్ డీలలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమని, సురక్షితమైన భావిస్తారు. అందుకే వీటి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో హెడ్ డీఎఫ్ సీ, ఆర్ బీఎల్, బంధన్, ఐసీఐసీఐ బ్యాంకులు ఎఫ్ డీలపై ఇస్తున్న వడ్డీరేట్ల వివరాలను తెలుసుకుందాం. దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్ల పథకాలను అమలు చేస్తున్నాయి. నిర్ణీత కాలవ్యవధికి చేసిన డిపాజిట్లకు వడ్డీని అందిస్తున్నాయి. ఎఫ్ డీ మెచ్యూర్ అయిన తర్వాత వడ్డీతో సహా అసలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీటిలో మన డబ్బు చాలా భద్రంగా ఉంటుంది. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా నిర్ణీత వడ్డీని అందజేస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు తదితర అవసరాల కోసం ప్రజలు ఎక్కువగా వీటిలో పెట్టుబడి పెడతారు. రిస్కు లేకుండా ఆదాయం కోరుకునేవారి ప్రథమ ఎంపికగా ఎఫ్ డీలను చెప్పవచ్చు.
ఫిక్స్ డ్ డిపాజిట్లపై అన్ని బ్యాంకులు ఒకే వడ్డీ రేటు అందజేయవు. వాటి నిబంధనల ప్రకారం ఎక్కువ, తక్కువలు ఉంటాయి. సాధారణ ఖాతాదారులకు ఒక రేటు, సీనియర్ సిటిజన్లకు మరో రేటు అందిస్తాయి. ఎఫ్ డీలలో డబ్బులను వేసే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను గమనించాలి. ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం లాభదాయకంగా ఉంటుంది. దేశంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులు తమ ఎఫ్ డీలపై వివిధ రకాల వడ్డీరేట్లు అమలు చేస్తున్నాయి. సాధారణ ప్రజలకు 2.75 నుంచి 8.1 శాతం వరకూ సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 8.6 శాతం వరకూ ఇస్తున్నాయి. మూడు కోట్ల లోపు ఫిక్స్ డ్ డిపాజిట్లపై అమలు చేస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి