Telugu News Business High return on investment in both schemes.. What is the difference between those schemes which are exclusively for women
MSSC vs SSY: ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అధిక రాబడి.. మహిళల కోసమే ప్రత్యేకంగా ఉన్న ఆ పథకాల మధ్య తేడాలివే..!
మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడే లక్ష్యంతో రూపొందించిన పథకంపై ఇటీవల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా అధిక వడ్డీ రేటు వస్తుందని ఆర్థిక నిపుణులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఉన్న సుకన్య సమృద్ధి యోజన పథకంతో ఈ పథకాన్ని చాలా మంది పోల్చి చూస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో ముఖ్యంగా బాలికల కోసం రూపొందించారు.
2023 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ (ఎంఎస్‌ఎస్‌సీ) పేరుతో ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ చిన్న పొదుపు పథకం ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించారు. మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడే లక్ష్యంతో రూపొందించిన పథకంపై ఇటీవల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా అధిక వడ్డీ రేటు వస్తుందని ఆర్థిక నిపుణులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఉన్న సుకన్య సమృద్ధి యోజన పథకంతో ఈ పథకాన్ని చాలా మంది పోల్చి చూస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో ముఖ్యంగా బాలికల కోసం రూపొందించారు. ఎంఎస్‌ఎస్‌సీ పథకం మహిళల కోసం రూపొందించారు. ఈ రెండు పథకాల మధ్య ప్రధాన తేడాలను తెలుసుకుందాం.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం
ఈ పథకం పెట్టుబడి వ్యవధి రెండు సంవత్సరాలు.
పెట్టుబడి పరిధి కనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షలుగా ఉంటుంది.
వడ్డీ రేటు ప్రభుత్వం 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. అలాగే వడ్డీత్రైమాసికానికి జమ అవుతుంది.
మొదటి సంవత్సరం తర్వాత ఖాతాదారుడు మొత్తంలో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈ ఖాతా మెచ్యూరిటీ సమయం రెండేళ్లు అంటే ఈ పథకంలో అక్టోబర్ 2023లో ఖాతా తెరిస్తే ఖాతా అక్టోబర్ 2025లో మెచ్యూర్ అవుతుంది.
వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయస్సు మహిళలైనా ఖాతాను తెరవగలరు.
బ్యాంక్ లేదా పోస్టాఫీసునులో ఈ ఖాతా ప్రారంభ ఫారమ్‌ను పూరించి, కేవైసీ పత్రాలను (ఆధార్ మరియు పాన్) అందించాలి. నగదు లేదా చెక్కు ద్వారా డబ్బు జమ చేసి ఖాతాను తెరువవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన
ఈ పథకం 10 సంవత్సరాల ల్లోపు ఆడపిల్లల కోసం రూపొందించారు.
డిపాజిట్ చేసిన మొత్తంపై 8% వడ్డీ.
సంవత్సరానికి కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షలు.
ఆడపిల్లకి 15 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
18 ఏళ్లు వచ్చాక అధ్యయనాల కోసం 50 శాతం ఉపసంహరణ. 21 ఏళ్లు వచ్చాక పూర్తి ఉపసంహరణ.
ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
ఈ ఖాతాను ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీసులో తెరవవచ్చు.
ఎంఎస్‌ఎస్‌సీ, ఎస్‌ఎస్‌వై మధ్య ప్రధాన తేడాలివే
ఎంఎస్‌ఎస్‌సీ స్వల్పకాలికమైనది. ఎస్‌ఎస్‌వై దీర్ఘకాలిక పెట్టుబడి పథకం.
ఎంఎస్‌ఎస్‌సీ ఏదైనా స్త్రీకి, ఎస్‌ఎస్‌వై బాలికల కోసం రూపొందించిన పథకం
మీ పెట్టుబడి లక్ష్యం, స్వల్పకాలిక లేదా దీర్ఘకాలికం ఆధారంగా ఎంచుకుని ఆయా పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు.