ఆంపియర్ మాగ్నస్ నియోలో వివిధ రకాల ఫీచర్లు ఉన్నాయి. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలో దీన్ని తీసుకువచ్చారు. 2025 జనవరి చివరిలో ఈ స్కూటర్ డెలీవరీలు జరుగుతాయి. ఈఎక్స్ తో పోల్చితే మరిన్ని ఫీచర్లను దీనిలో ఏర్పాటు చేశారు. అయితే ధర మాత్రం ఆ మోడల్ కు సమానంగా ఉంటుంది. కొత్త స్కూటర్ లో 2.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి సింగిల్ చార్జింగ్ తో సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. 7.4 ఏ చార్జర్ ను ఉపయోగించి బ్యాటరీని 5 నుంచి 6 గంటల్లో చార్జింగ్ చేసుకునే వీలుంది. గంటకు గరిష్టంగా 63 కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేయవచ్చు. అయితే ఈఎక్స్ వేరియంట్ లో ఈ వేగం 53 కిలోమీటర్లకే పరిమితమైంది.
మాగ్నస్ నియో స్కూటర్ లో ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. దీనిలో పూర్తి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఇది కనెక్టివీటి ఫీచర్లకు మద్దతు పలుకుతుంది. ఫైండ్ మై స్కూటర్, లైవ్ ట్రాకింగ్, యాంటీ థెప్ట్ అలారం, రెండు అలర్ట్ తదితర ఫీచర్లు బాగున్నాయి. ప్రయాణంలో సౌలభ్యం కోసం యూఎస్ బీ చార్జింగ్ పోర్ట్ ఏర్పాటు చేశారు. వినియోగదారులను ఆకట్టుకునేలా ఐదు రకాల రంగుల్లో స్కూటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. నలుపు, నీలం, ఎరుపు, తెలుపు, బూడిద తదితర రంగుల్లో ఆకట్టుకుంటోంది. అలాగే ఐదేళ్లు లేదా 75 వేల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని అందజేస్తుంది.
పెరుగుతున్న ఇంధనం ధరల నుంచి తప్పించుకునేందుకు ప్రజలకు ఏకైక మార్గంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు మారాయి. ఈ కారణంతోనే చాలామంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ లో ఓలా, ఏథర్ తదితర సంస్థలు తమ స్థానాన్ని పదిలం చేసుకున్నాయి. ఈ కంపెనీలు విడుదల చేసి వివిధ మోడళ్లు జనాదరణ పొందాయి. అలాగే కొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా ఈవీల తయారీని ప్రవేశించాయి. వాటిలో ఆంపియర్ ఒకటి. ఈ కంపెనీ వాహనాలకు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి