Bank Account: చాలా మంది బంకుల్లో డబ్బులు దాచుకుంటారు. చిన్న మొత్తాలు పొదుపు ఖాతాల్లో (సేవింగ్స్ ఎకౌంట్స్) లో మదుపు చేస్తుంటారు. అయితే, ఈ ఎకౌంట్ లో బ్యాంకులు వడ్డీ తక్కువగా ఇస్తుంటాయి. కానీ, కొన్ని చిన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి, ఇది చాలా బ్యాంకుల స్థిర డిపాజిట్ రేట్ల కంటే ఎక్కువ. కానీ ఇవి షరతులతో ఈ డిపాజిట్లపై వడ్డీరేటు ఆఫర్ చేస్తాయి. ఉదాహరణకు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు 5% నుంచి 7.25% మధ్య వడ్డీ రేట్లు పొందవచ్చు. మీ ఎకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ కనుక లక్షరూపాయల వరకూ ఉంటే, 5 శాతం వడ్డీ రేట్ ఇస్తుంది ఉత్కర్ష బ్యాంక్. ఒకవేళ లక్ష నుంచి 25 లక్షల వరకూ ఉంటె కనుక 6 శాతం ఇస్తుంది. 25 లక్షల కన్నా ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఈ బ్యాంకు నుంచి 7.25 శాతం వడ్డీ పొందవచ్చు. సరాసరి మినిమమ్ ఎవరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ ఎకౌంట్ ను బట్టి మారుతుంది. సాధారణ సేవింగ్స్ ఎకౌంట్ కు ఇది 5 వేల రూపాయలుగా ఉంటె.. ప్రీమియం సేవింగ్స్ ఎకౌంట్ కు 50 వేలుగా ఉంది.
ఇక ప్రయివేట్ బ్యాంకుల్లో బంధన్ బ్యాంక్ 7.15%, ఆర్బిఎల్ బ్యాంక్ 6.5%, ఐడీఎఫ్సి బ్యాంక్6% వడ్డీని పొదుపు ఖాతాలపై అందిస్తున్నాయి. పెద్ద మొత్తంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోవడం ద్వారా ఈ వడ్డీరేటు పొందోచ్చని తమ వినియోగదారులకు ఆయా బ్యాంకులు చెబుతున్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్ తన డిజిటల్ కస్టమర్లకు ఎకౌంట్ లో కనీసం మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకూ బేలెన్స్ ఉంచితే 6.5% వడ్డీ రేటు ఇస్తామని తన వెబ్సైట్ లో పేర్కొంది. లక్ష రూపాయల వరకూ బేలెన్స్ ఉంటె కనుక 4.75%, అదే లక్ష రూపాయల నుంచి పడి లక్షల వరకూ బేలెన్స్ ఉంచితే కనుక 6% వడ్డీ రేట్లను ఈ బ్యాంకు ఆఫర్ చేస్తోంది.
అలాగే బంధన్ బ్యాంక్ విషయానికి వస్తే 50 కోట్ల రూపాయల కంటె ఎక్కువ బేలెన్స్ ఉంచిన వారికీ 7.15% వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. అదేవిధంగా లక్ష రూపాయల లోపు రోజువారీ బేలెన్స్ ఉంటె 3% వడ్డీ, లక్ష నుంచి 10 కోట్ల వరకూ 6 శాతం వడ్డీ ఈ బ్యాంకు అందిస్తోంది.
అదేవిధంగా ఐడీఎఫ్సి బ్యాకు కూడా కోటిరూపాయల బ్యాలెన్స్ ఉన్నవారికి 6 శాతం వడ్డీ ఇస్తోంది. కోటి నుంచి ఐదు కోట్ల రూపాయల వరకూ బేలెన్స్ ఉంచిన వారికి 5% వడ్డీ రేట్ ఆఫర్ చేస్తోంది.
ఇక పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విషయానికి వస్తే ఐడీబీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఎక్కువ వడ్డీరేటును పొదుపు ఖాతాలపై అందిస్తున్నాయి. 50 లక్షల నుంచి 100 కోట్ల వరకూ ఉండే డిపాజిట్లపై ఈ బ్యాంకులు 3.5% వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి.