Investment Plan: ఎక్కువ వడ్డీ కావాలా.. అయితే మీ డబ్బును ఇలా పెట్టుబడి పెట్టండి..

|

Mar 02, 2022 | 7:39 AM

Investment Plan: దేశంలోని ప్రైవేట్ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ వివిధ పదవీకాల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (FD Interest rates) పెంచాయి. ఈ రేట్ల పెంపు నిర్ణయం రిస్క్ తీసుకోని పెట్టుబడిదారులకు ఒక శుభవార్తనే చెప్పుకోవాలి.

Investment Plan: ఎక్కువ వడ్డీ కావాలా.. అయితే మీ డబ్బును ఇలా పెట్టుబడి పెట్టండి..
Deposit Rates
Follow us on

Investment Plan: దేశంలోని ప్రైవేట్ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ వివిధ పదవీకాల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (FD Interest rates) పెంచాయి. ఈ రేట్ల పెంపు నిర్ణయం రిస్క్ తీసుకోని పెట్టుబడిదారులకు ఒక శుభవార్తనే చెప్పుకోవాలి. దశాబ్దకాలంగా తక్కువ వడ్డీ రేట్లతో పాటు అనేక మార్లు బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించటం మనం గమనించాము. ఇదే సమయంలో పోస్టల్ స్కీములు(Term Deposits), చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు మాత్రం చాలా వరకు ఎటువంటి మార్పులు లేకుండా అలాగే కొనసాగుతున్నాయి. ఈ కారణంగా బ్యాంకులు అందించే వడ్డీ కన్నా పోస్టల్ టెర్మ్ డిపాజిట్లపై మదుపరులకు ఎక్కువ వడ్డీ రేటు లభిస్తోంది. ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, పోస్టల్ టెర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..

HDFC ఎఫ్‌డి వడ్డీ రేట్లు..

రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్‌డిలపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వడ్డీ రేట్లను 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 14, 2022 నుండి అమలులోకి వస్తాయి. బ్యాంక్ ఒక సంవత్సరం FD వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు 4.9% నుంచి 5%కి పెంచింది. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు డిపాజిట్లపై 5 బేసిస్ పాయింట్లు.. 5.40% నుంచి 5.45%కి పెంచింది.

SBI ఎఫ్‌డి వడ్డీ రేట్లు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిబ్రవరి 15, 2022 నుంచి అమలులోకి వచ్చే.. 2 సంవత్సరాలకు పైబడిన ఫిక్సెడ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను 10-15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
SBI వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ FD కాలానికి వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.20 శాతానికి చేరింది. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 15 బేసిస్ పాయింట్లు పెంచి 5.45 శాతానికి పెంచారు. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు FD పదవీకాలం కోసం వడ్డీ రేటును బ్యాంకు 10 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్‌డీలకు కొత్త రేట్లు వర్తిస్తాయి.

Post Office Term Deposits వడ్డీ రేట్లు..

ఏడాది నుంచి మూడు సంవత్సరాల వరకు డిపాజిట్‌పై, పోస్ట్ ఆఫీస్ 5.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్ ఖాతాకు 6.7 శాతం వడ్డీ చెల్లిస్తోంది. వడ్డీ వార్షికంగా చెల్లించబడుతుంది కానీ ఈ టర్మ్ డిపాజిట్ల కోసం త్రైమాసికానికి ఒకసారి లెక్కించబడుతుంది. ఇందుకోసం పెట్టుబడి పెట్టవలసిన కనీస మొత్తం రూ. 1,000 ఉండగా.. గరిష్ఠ పరిమితి లేదు. మీరు 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో చేసిన డిపాజిట్ ఆదాయపు పన్ను చట్టం- 1961, సెక్షన్ 80C కింద ఆదాయపు పన్ను మినహాయింపుకు అర్హత పొందుతుంది. ఆర్థిక సంవత్సరంలో రూ.40,000 ఎఫ్డీలపై వచ్చే వడ్డీ మెుత్తానికి పోస్ట్ ఆఫీస్ టీడీఎస్ రూపంలో పన్నును తీసివేయవచ్చు.

ఇవీ చదవండి..

Russia-Ukraine war Effect: రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం భారత్ పై ఎంత.. వాణిజ్యంలో రెండు దేశాలు పరస్పరం ఎంతమేర ఆధారపడ్డాయి..

Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడం అంత సులభమేనా?.. అసలు ఏ రాష్ట్రంలో పెన్షన్ ఎలా..