AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Splendor Electric: హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్ వచ్చేస్తోంది.. పాత బైకే.. కానీ మారిందిలా..

హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. పూణేలో పరీక్షీస్తుండగా ఇది కెమెరా కంటికి చిక్కింది. ఇదే క్రమంలో మొత్తం ఎలక్ట్రిక్ బైక్ నే కొనుగోలు చేయకుండా.. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బైక్ లనే సులభంగా ఎలక్ట్రిక్ బైక్ గా మార్చేసే కిట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇది మన దేశంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఈ కిట్ సాయంతోనే హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్ ను తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.

Hero Splendor Electric: హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్ వచ్చేస్తోంది.. పాత బైకే.. కానీ మారిందిలా..
Hero Splendor Electric
Madhu
|

Updated on: Jan 22, 2024 | 7:41 AM

Share

మన దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ అంచనాలను మించి రాణిస్తోంది. అనుకున్న దానికంటే వేగంగా జనాదరణ పొందుతోంది. అంతకంతకూ డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో అన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులు లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న పలు టాప్ బ్రాండ్ల మొడళ్లు కూడా ఎలక్ట్రిక్ వేరియంట్లో మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిల్లో హీరో స్ల్పెండర్ ఒకటి. హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. పూణేలో పరీక్షీస్తుండగా ఇది కెమెరా కంటికి చిక్కింది. ఇదే క్రమంలో మొత్తం ఎలక్ట్రిక్ బైక్ నే కొనుగోలు చేయకుండా.. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బైక్ లనే సులభంగా ఎలక్ట్రిక్ బైక్ గా మార్చేసే కిట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇది మన దేశంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఈ కిట్ సాయంతోనే హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్ ను తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. దీని గురించి తెలుసుకుందాం..

గోగోఏ1(GoGoA1)..

మన దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. వాటిల్లో ప్రధానంగా గోగోఏ1(GoGoA1) బ్రాండ్ నేమ్ బాగా వినిపిస్తోంది. ఇది ఎలక్ట్రిక్ బైక్ బ్రాండ్ కాదు. ఇది ఏం చేస్తుందంటే కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేయకుండా.. ఇప్పటికే ఉన్న ఐసీఈ అంటే పెట్రోల్ ఇంజిన్ బైక్ ను సులభంగా ఎలక్ట్రిక్ గా మార్చేస్తుంది. కేవలం ఒక్క కిట్ సాయంతో ఇది దానిని ఎలక్ట్రిక్ వేరియంట్ గా మార్చేస్తుంది. అదెలా అంటే..

ఓ ప్రత్యేకమైన విధానంలో..

ద్విచక్ర వాహన ఈవీల రంగంలో గోగోఏ1 చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. విభిన్నంగా ఆలోచించింది. కొత్త ఎలక్ట్రిక్ వేరియంట్ వాహనాలు మార్కెట్లోకి తీసుకొని రావడం కంటే ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ఇంజిన్ వాహనాలను ఎలక్ట్రిఫై చేయడంపై దృష్టి పట్టింది. అది కూడా చాలా సులభంగా. దీంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా ఈ గోగోఏ1 కిట్ సాయంతోనే హీరో స్ల్పెండర్ ను పూణేలో పరీక్షించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

హీరో స్ప్లెండర్ ప్రోటోటైప్..

పూణేలో గుర్తించిన ఎలక్ట్రిక్ హీరో స్ప్లెండర్ ప్రోటోటైప్ సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ మోటారుసైకిల్ ఎరుపు రంగులో, తాత్కాలిక నంబర్ ప్లేట్తో మొత్తం పూర్తిగా సంప్రదాయ ఇంధన బైక్ లా కనిపిస్తోంది. ఎందుకంటే దీని సీటు, వెనుక గ్రాబ్ రైల్ డిజైన్, ఇతర లక్షణాలుఅన్ని కూడా పాత మోడల్ లాగానే కనిపిస్తోంది. దీనిని కేవలం పరీక్షల కోసమే ఇలా తయారు చేసి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏఆర్ఏఐ పరీక్ష చేసిందా?

పూణేలో కనిపించిన ప్రోటోటైప్ ను పరిశీలిస్తే, హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), ఇతర నియంత్రణ సంస్థలు దీనిని పరీక్షించినట్లు సమాచారం. దీని కోసం ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ లల ప్రసిద్ధి చెందిన గోగోఏ1 ను వినియోగించినట్లు చెబుతున్నారు.

గోగోఏ1 ఉత్పత్తులు ఇవి..

గోగోఏ1 నుంచి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉత్పత్తి శ్రేణిని పరిశీలిస్తే, వాటిల్లో హీరో మోటోకార్ప్, హోండా టూ వీలర్ మోడల్స్ కోసం రూపొందించిన ప్రీ-ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌లు మనకు కనిపిస్తాయి. కంపెనీ ఇప్పటికే స్ప్లెండర్ మోటార్‌సైకిళ్ల కోసం కన్వర్షన్ కిట్‌లను అందజేస్తుండగా, మరిన్ని కొత్త కిట్లు పరీక్షలో ఉన్నట్లు సూచనలు ఉన్నాయి. ఈ కొత్త పునరావృత్తి కొంచెం పెద్ద బ్యాటరీని కలిగి ఉండవచ్చు, ఇది మెరుగైన శ్రేణి సామర్థ్యాలను సూచిస్తుంది.

ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌లో ఏముంటాయి..

స్ప్లెండర్ కోసం గోగోఏ1 తయారు చేసిన ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ లోని స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే 3.94 కేడబ్ల్యూ (5.28 బీహెచ్పీ) గరిష్ట శక్తితో పాటు 2 కేడబ్ల్యూ (2.7 బీహెచ్పీ) నిరంతర విద్యుత్ ఉత్పత్తితో వెనుక హబ్ మోటార్‌ను కలిగి ఉంది . అయితే ప్రస్తుతం నమూనా మాత్రమే నని అసలు మోటార్ విషయానికి వచ్చేసరికి మరింత శక్తినిచ్చే వైట్ హబ్ మోటార్ తో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ధర ఎంత ఉండొచ్చు..

ప్రస్తుతం స్ప్లెండర్ కోసం గోగోఏ1 తయారు చేసిన ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ కు ఏఆర్ఏఐ ఆమోదం పొందింది. అలాగే పేటెంట్ కూడా పొందింది. దీంతో ఈ మోటార్‌సైకిల్ కన్వర్షన్ కిట్‌ను రూ. 29,000కు కొనుగోలు చేయొచ్చు. అయితే హీరో మోటోకార్ప్, హోండాతో సహా 45 వేర్వేరు వాహనాలకు ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌లను అందిస్తూ ఉండటంతో ఈ ధరలో ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటాయేమో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..