Hero Motocorp: మీరు స్కూటీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే కేవలం ఒక్క రూపాయి డౌన్ పేమెంట్‌తో ఇంటికి తీసుకురావచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హీరో మోటోకార్ప్ ఈ ప్రకటన చేసింది. అయితే ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. అంతేకాదు మార్చి 11 వరకు మాత్రమే కొనసాగుతుంది. ఈ సమయంలో మీరు సమీపంలోని హీరో షోరూమ్‌ని సందర్శించడం ద్వారా ఏదైనా స్కూటర్‌ని కొనుగోలు చేయవచ్చు. రూ.1 డౌన్ పేమెంట్ సౌకర్యంతో క్యాష్ బోనస్ ఆఫర్ కూడా ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రకారం మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ 125, ప్లెజర్ ప్లస్ కొనుగోలుపై మహిళలకు రూ.4,000 వరకు నగదు బోనస్ ఇస్తున్నారు. దీంతో పాటు డెస్టినీ 125 బైక్ కొనుగోలుపై రూ. 2,000 లాయల్టీ బోనస్ కూడా అందుబాటులో ఉంది. బుకింగ్ మహిళ పేరు మీద ఉండాలి. మార్కెట్‌లో డెస్టినీ 125 ధర రూ.70,400, మాస్ట్రో ఎడ్జ్ 125 ధర రూ.73,450, మాస్ట్రో ఎడ్జ్ 110 ధర రూ.66,820. 4 నుంచి 6 వేల రూపాయల తగ్గింపు మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది.
అలాగే భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే ద్విచక్ర వాహనం ఏదైనా ఉందంటే అది హీరో స్ప్లెండర్. ఇతర బైకులతో పోలిస్తే ఈ బైక్ రేట్, మెయింటెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ. అందుకే సామాన్య ప్రజలు దీనిని ఎక్కువగా విక్రయించడానికి ఇష్ట పడతారు. అయితే పెట్రోల్ ధరలు అధికంగా పెరగడంతో చాలామంది ద్విచక్ర వాహనాలను బయటకు తీయాలంటే ఆలోచిస్తున్నారు. అయితే సామాన్య ప్రజానీకం వీటి నుంచి బయటపడటానికి హీరో కంపెనీ స్ప్లెండర్ బైక్ కోసం ఈవీ కన్వర్షన్ కిట్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. తమకు ఇష్టమైన బైకులో ఈ ఎలక్ట్రిక్ కిట్ ఇన్స్టాల్ చేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు దీనికి ఆర్టీఓ ఆమోదం కూడా లభించడం విశేషం.