హీరో మోటోకార్ప్ తన కస్టమర్ల కోసం మరో గొప్ప ఫీచర్స్‌తో బైక్‌ను విడుదల చేసింది.అత్యాధునిక ఫీచర్లతో, సాంకేతికను ఉపయోగించి సరికొత్త హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ (Hero Karizma XMR) బైక్‌ను, ఎల్లో, రెడ్, బ్లాక్ కలర్స్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.1,72,900 ప్రారంభ ధరతో విడుదలైంది. అయితే ఆగస్టు 29 నుంచి ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభించినట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. ఈ మేరకు హీరో మోటో కార్ప్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ హీరో మోటోకార్ప్ తన ప్రసిద్ధ మోడల్ హీరో కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్‌ను భారత మార్కెట్లో మరోసారి పూర్తిగా కొత్త స్టైల్‌లో విడుదల చేస్తున్నట్లు తెలిపింది.అత్యంత శక్తివంతమైన, ఇంజన్‌తో విడుదల చేసింది. అయితే ఈ బైక్‌లో కంపెనీ అనేక మార్పులు చేసింది. ఇది మునుపటి మోడల్‌కంటే కాస్త భిన్నంగా తయారు చేసింది. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ బైక్‌లో 25.5PS పవర్, 20.4Nm టార్క్ ఉత్పత్తి చేసే కొత్త 4V, DOHC లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను 210సీసీ కెపాసిటీతో అందుబాటులో తీసుకువచ్చింది. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను అమర్చింది.
కంపెనీ ఈ బైక్‌కు కొత్త డైనమిక్ ఏరో లేయర్డ్ డిజైన్‌ను అందించింది. ఇది LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో పాటు సెగ్మెంట్ మొదటి సర్దుబాటు విండ్‌షీల్డ్‌ను పొందుతోంది. ఈ బైక్‌లో ఇన్స్ట్‌మెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్ ఎల్‌సీడీతో అమర్చింది కంపెనీ. ఇది కాకుండా, బైక్ బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్ సదుపాయాన్ని కూడా ఉంది. అలాగే ఈ కొత్త కరిజ్మా తేలికైన క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్‌ను అందించింది కంపెనీ. ఇది స్లిప్ అసిస్ట్ క్లచ్, ఆరు-దశల మోనోషాక్ సస్పెన్షన్‌తో అమర్చబడింది. మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించింది.
అయితే కంపెనీ మాత్రం అధికారిక మైలేజ్ గణాంకాలను విడుదల చేయలేదు. అయితే ఇది 32 kmpl తిరిగి వస్తుందని భావిస్తున్నారు. 2023 హీరో కరిజ్మా గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. కరిజ్మా XMR పదునైనదిగా కనిపిస్తుంది. మునుపటి కరిజ్మా కంటే మరింత డిజైన్‌ను చేసినట్లు కంపెనీ తెలిపింది. కానీ ఇప్పుడు సెగ్మెంట్‌లో మొదటిది అయిన స్పోర్టీ, మంచి విండ్‌స్క్రీన్‌ను పొందింది. కరిజ్మా XMR డ్యూయల్-ఛానల్ ABSతో వెనుక డిస్క్‌తో పాటు స్ప్లిట్ సీట్ సెటప్‌ను అందించింది. హీరో కరిజ్మా XMR 210 సుజుకి Gixxer SF250, యమహా R15 V4 వంటి బైక్‌లతో పోటీపడనుందని కంపెనీ వెల్లడించింది.
The moment we’ve been holding our breaths for is finally here! Introducing the sensational new Karizma XMR, available at an irresistible introductory price starting at Rs. 1,72,900 (Ex-showroom price All India). Bookings will open at 2:10 pm! 🚀🔥
— Hero MotoCorp (@HeroMotoCorp) August 29, 2023
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి