LPG Connection: మీరు కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలా? దరఖాస్తు చేయడం ఎలా? ఎలాంటి పత్రాలు కావాలి?

|

Mar 04, 2024 | 9:02 PM

ఈ రోజుల్లో అందరి ఇళ్లలో ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటుంది. కొందరు గ్యాస్‌ కనెక్షన్‌ లేని వారు కొత్త కనెక్షన్‌ తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే ఈ గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటో ఎంతో ప్రాసెస్ ఉంటుందని అనుకుంటారు. కానీ సులభంగానే ఉంటుంది. చిన్నపాటి ప్రాసెస్‌లోనే మీరు కొత్త కనెక్షన్‌ పొందవచ్చు. అయితే కొత్త LPG కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి..? ఎలాంటి పత్రాలు అవసరం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంటి అవసరాల కోసం ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌కు..

LPG Connection: మీరు కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలా? దరఖాస్తు చేయడం ఎలా? ఎలాంటి పత్రాలు కావాలి?
Lpg Connection
Follow us on

Here’s How You Can Apply For New LPG Connection, Security Deposit and Required Documents For New Connection

ఈ రోజుల్లో అందరి ఇళ్లలో ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటుంది. కొందరు గ్యాస్‌ కనెక్షన్‌ లేని వారు కొత్త కనెక్షన్‌ తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే ఈ గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటో ఎంతో ప్రాసెస్ ఉంటుందని అనుకుంటారు. కానీ సులభంగానే ఉంటుంది. చిన్నపాటి ప్రాసెస్‌లోనే మీరు కొత్త కనెక్షన్‌ పొందవచ్చు. అయితే కొత్త LPG కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి..? ఎలాంటి పత్రాలు అవసరం పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎలా దరఖాస్తు చేయాలి?

కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం మీరు సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాన్ని సందర్శించాలి. అక్కడికి వెళ్లి కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు ఫారమ్‌ను సేకరించి, ఫారమ్‌ను నింపి సమర్పించండి. ఈ సందర్భంలో మీ నివాస రుజువు అందించడం తప్పనిసరి. ఒక వేళ మీరు మీ సొంత ఊళ్లలో ఉండకుండా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే అక్కడి అడ్రస్‌ తప్పనిసరి. ఒక వేళ మీరు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ అక్కడి అడ్రస్‌ ఫ్రూప్‌ మీ పేరుపై లేకపోతే మీరు ఉంటున్న ఇంటి కరెంటు బిల్లు తప్పనిసరి అవసరం.

కావాల్సిన పత్రాలు:

  • రేషన్ కార్డు
  • విద్యుత్ బిల్లు
  • టెలిఫోన్ బిల్లు
  • పాస్‌పోర్ట్‌
  • యజమాని సర్టిఫికేట్
  • ఫ్లాట్ కేటాయింపు లేదా స్వాధీనం లేఖ
  • ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్
  • ఓటరు కార్డు
  • అద్దె ఇంట్లో ఉంటే, అద్దె రసీదు
  • పాన్ కార్డ్
  • ఆధార్ కార్డ్

ఫారమ్, రిజిస్ట్రేషన్ సమర్పించిన తర్వాత గ్యాస్ పంపిణీదారు మీకు కొత్త కనెక్షన్‌కు సంబంధించి బుక్‌, పత్రాలు అందజేస్తారు.

ఈ సందర్భంలో, ISI మార్క్ హాట్‌ప్లేట్ మరియు సురక్షిత LPG పైపును కలిగి ఉండటం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. గ్యాస్ కనెక్షన్ అందించినప్పుడు, ఈ సమస్యలను పరిశీలిస్తారు.

ముందస్తు డిపాజిట్‌

ఇంటి అవసరాల కోసం ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌కు సెక్యూరిటీ డిపాజిట్‌గా సుమారు 7 నుంచి 8 వేల వరకు తీసుకుంటారు. ఒక వేళ మీకు మీకు గ్యాస్‌ కనెక్షన్‌ డాక్యుమెంట్‌ మాత్రమే కావాలంటే సుమారుగా రూ.2200 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు రెగ్యులేటర్ కోసం ప్రత్యేకంగా 250 రూపాయలు చెల్లించాలి. అయితే ప్రాంతాలను బట్టి ఈ డిపాజిట్‌ ఉంటుందని గుర్తించకోండి. కొన్ని ప్రాంతాల్లో మీ కొత్త కనెక్షన్‌లో గ్యాస్‌ స్టౌ, రెగ్యులేటర్‌, గ్యాస్‌ సిలిండర్‌తో కలిపి మొత్తం వసూలు చేస్తారు. లేదా కేవలం డాక్యుమెంట్‌ మాత్రమే అవసరం అనుకుంటే తక్కువ అమౌంట్‌ను డిపాజిట్‌గా తీసుకుంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి