Simple One Scooter: సింగిల్ చార్జ్ పై ‘సింపుల్’ గా 300 కి.మీ వెళ్లిపోవచ్చు.. బుకింగ్స్ ఫుల్.. డెలివరీలు ఎప్పుడంటే..

ఈ స్కూటర్లో 4.3 kwh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 236 km మైలేజీ వస్తుంది. మార్చుకోదగిన బ్యాటరీ సాయంతో మొత్తం 300 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు.

Simple One Scooter: సింగిల్ చార్జ్ పై ‘సింపుల్’ గా 300 కి.మీ వెళ్లిపోవచ్చు.. బుకింగ్స్ ఫుల్.. డెలివరీలు ఎప్పుడంటే..
Simple One
Follow us

|

Updated on: Mar 25, 2023 | 7:00 PM

బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఏప్రిల్ 2023లో కమర్షియల్ గా లాంచ్ చేయనుంది. ఈ స్కూటర్ 2021లోనే ఆవిష్కరించి, అదే సమయంలో మార్కెట్లో విడుదల చేశారు. అప్పట్లో దీని ధర రూ. 1.09లక్షలు(ఎక్స్ షోరూం)గ ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ స్కూటర్ ను రీలాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకా దీని ధర కూడా పెరిగే అవకాశం ఉంది.

వేగంగా డెలివరీలు..

ఇకపై వచ్చే బుకింగ్స్ కు వేగంగా డెలివరీలు చేసేలా కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ముందుగా బెంగళూరులో దీని డెలివరీలు ప్రారంభించి, తర్వాత నెమ్మదిగా ఇతర నగరాల్లో కూడా డెలివరీలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రీలాంచ్ చేయనున్న స్కూటర్ ను తమిళనాడులోని సింపుల్ విజన్ 1.0 ప్లాంట్ లో త్వరలో ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ చేసుకున్న వారు చాలా కాలం నుంచి డెలివరీల కోసం వేచి చూస్తున్నారు. కొన్ని అంతర్గత ఇబ్బందుల కారణంగా బుక్ చేసుకున్న వినియోగదారులకు డెలివరీలు సమయానికి ఆ కంపెనీ ఇవ్వలేకపోయింది.

ప్రస్తుతం దీని ధర ఇలా..

ఈ స్కూటర్ ఆవిష్కరించిన సమయంలో దీని ధర రూ. 1.09 లక్షలు గా ఉంది. ఇప్పుడు దీని ధర రూ. 1.45 లక్షలు(ఎక్స్ షోరూం) ఉంది. ఇది మార్చుకోదగిన బ్యాటరీ 4.3 kwh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 236 km మైలేజీ వస్తుంది. మార్చుకోదగిన బ్యాటరీ సాయంతో మొత్తం 300 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు.

ఇవి కూడా చదవండి

స్పెసిఫికేషన్లు ఇలా..

దీనిలో 8.5 kw ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 11బీహెచ్పీ శక్తిని, 72 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. 4జీ కనెక్టివిటీతో కూడిన బ్లూటూత్ ఉంటుంది. దీని ద్వారా మ్యూజిక్, కాల్స్ మాట్లాడవచ్చు. అన్ బోర్డ్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. అలాగ వివిధ రకాల డ్రైవింగ్ మోడ్లు అందుబాటులో ఉంటాయి. ఇది అజ్యూర్ బ్లూ, బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్, నమ్మా రెడ్ వంటి కలర్ ఆప్షన్లలో వస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..