మన దేశంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు. ఇది ఉంటేనే మన దేశంలో సిటిజెన్ గా హక్కులు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అందించే ఏ పథకానికి అయినా ఈ ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇటీవల కాలంలో ప్రభుత్వం వ్యక్తులు తమ ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతాలను లింక్ చేయాలని సూచించింది. దానికి పలు దఫాలుగా గడువులు కూడా ఇచ్చింది. అయితే చాలా మంది ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డులను లింక్ చేయలేదు. దీంతో వ్యక్తుల ఆర్థిక లావాదేవీలకు ఇబ్బంది అవుతోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని 12,000 మందికి పైగా విద్యార్థులు తమ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలతో ఆధార్‌ను లింక్ చేయకపోవడంతో 2022-23కి సంబంధించిన స్కాలర్‌షిప్ మొత్తాలను పొందలేకపోయారని ఓ నివేదిక తెలిపింది. ఆ క్రమంలో మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కు లింక్ అయి ఉందా లేదా అనే దాన్ని సరిచూసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మీరు య యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) పోర్టల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అందులో మై ఆధార్ సెక్షన్లో వ్యక్తుల ఆధార్ నంబర్‌తో ఏ బ్యాంక్ ఖాతా లింక్ చేయబడిందో తనిఖీ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి బహుళ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే, ఒక ఖాతాకు మాత్రమే ఆధార్‌తో లింక్ చేయవచ్చు. అది ఎలా తనిఖీ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధార్ స్టేటస్‌తో బ్యాంక్ ఖాతా సీడింగ్ వివరాలు ‘యాక్టివ్’ లేదా ‘ఇనాక్టివ్’గా చూపిస్తాయి. ఇది కాకుండా, బ్యాంక్ సీడింగ్ పేజీ మొత్తం నాలుగు వివరాలను చూపుతుంది. చూపబడిన మొదటి సమాచారం ఆధార్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి. ఇతర అంకెలు ముసుగు వేయబడి ఉంటాయి. రెండో సమాచారం ‘బ్యాంక్ పేరు’. మూడో సమాచారం బ్యాంక్ సీడింగ్ స్థితి (యాక్టివ్/ఇనాక్టివ్). సీడింగ్ స్థితి చివరిగా ఎప్పుడు అప్‌డేట్ చేయబడింది అనేది నాల్గో సమాచారం. బ్యాంక్ ఖాతా సీడింగ్ పేజీ దిగువన ఒక హెచ్చరిక సందేశం కూడా కనిపిస్తుంది.లింక్ ద్వారా అందించబడిన సమాచారం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సర్వర్ నుంచి తీసుకున్నమని చెబుతుంది. దాని కచ్చితత్వానికి యూఐడీఏఐ బాధ్యత వహించదు. అలాగే కనిపించిన సమాచారం యూఐడీఏఐ స్టోర్ చేయదు. అయితే మీ బ్యాంక్ ఖాతాల్లో ఏవి ఆధార్‌తో లింక్ అయ్యాయో తెలుసుకునేందుకు, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) గురించి తెలుసుకోవడంలో మీకు సహాయపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..