EPFO: ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఖాతాలున్నాయా.? అయితే వెంటనే ఇలా చేయండి.. లాభాలెన్నో!

|

Dec 14, 2022 | 9:57 AM

పీఎఫ్ ఖాతాలను విలీనం చేయడం ఇప్పుడు మరింత సులభతరం. ఇంటి దగ్గర కూర్చునే ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

EPFO: ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఖాతాలున్నాయా.? అయితే వెంటనే ఇలా చేయండి.. లాభాలెన్నో!
PF ఉపసంహరణపై TDSని నివారించడానికి, ఫారమ్ 15G/ఫారమ్ 15Hని సమర్పించవచ్చు. ఫారమ్ 15G/ఫారం 15H, EPF ఉపసంహరణ మొత్తంపై TDSని నివారించడం కోసం ఇస్తారు. ఈ క్రమంలో PAN కూడా సమర్పించాల్సి ఉంటుంది.
Follow us on

మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఖాతాలున్నాయా.? అయితే వెంటనే వాటిని మెర్జ్(Merge) చేసుకోండి. ఎన్నో లాభాలు పొందొచ్చు. పీఎఫ్ ఖాతాలను విలీనం చేయడం ఇప్పుడు మరింత సులభతరం. ఇంటి దగ్గర కూర్చునే ఆన్‌లైన్‌లో చేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఖాతాలను విలీనం చేస్తే.. వాటిపై వచ్చే వడ్డీ మొత్తం పెరుగుతుంది. అలాగే ఖాతాలను తరచుగా అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా మీ సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు.

అటు ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఖాతాలను విలీనం చేయడం ద్వారా, మీ ఖర్చులు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను కూడా సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఉదాహరణకు మీరు ఒక కంపెనీ నుంచి వేరే సంస్థలోకి మారినట్లయితే.. అక్కడ మీ పాత UAN నెంబర్‌ వారికి ఇస్తే, మీ పాత పీఎఫ్ ఖాతాను కొత్తదానికి లింక్ చేయడం జరుగుతుంది. కానీ మునుపటి పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తం కొత్త ఖాతాకు బదిలీ చేయబడదు. అలాంటి పరిస్థితిలో పాత ఫండ్‌ను కొత్త ఖాతాకు బదిలీ చేయాలంటే, పీఎఫ్ ఖాతాలను విలీనం చేయాల్సి ఉంటుంది.

పీఎఫ్ ఖాతాలను విలీనం చేయండిలా..

  • ముందుగా, మీరు ఈపీఎఫ్ఓ అఫీషియల్ వెబ్‌సైట్ https://unifiedportal mem.epfindia.gov.inలోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత ‘ఆన్‌లైన్ సర్వీసుల’ ట్యాబ్‌లో ‘వన్ మెంబర్.. వన్ ఈపీఎఫ్ అకౌంట్’ను ఎంచుకోండి.
  • మీ వ్యక్తిగత వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అలాగే ఇది మీ న్యూ EPF ఖాతా వివరాలను కూడా చూపిస్తుంది.
  • పాత/మునుపటి PF ఖాతాను బదిలీ చేయడానికి, మీ ప్రస్తుత లేదా మునపటి ఎంప్లాయిర్ ధృవీకరణ తప్పనిసరి.
  • మునుపటి PF ఖాతా నెంబర్ లేదా మునుపటి UAN నెంబర్‌ను నమోదు చేయండి.
  • అనంతరం ‘గెట్ డిటైల్స్’పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మునుపటి ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించిన వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • ఆ తర్వాత ‘గెట్ OTP’పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది.
  • ఆ OTPని నమోదు చేసి, సబ్మిట్ నొక్కండి.

అప్పుడే మీ EPF ఖాతా విలీనం కోసం చేసిన అభ్యర్థన సక్సెస్‌ఫుల్ అవుతుంది. అనంతరం మీ ప్రస్తుత ఎంప్లాయిర్ సమర్పించిన విలీన అభ్యర్థనను ఆమోదించాలి. మీ ఎంప్లాయిర్ దానిని ఆమోదించిన తర్వాత, EPFO అధికారులు మీ మునుపటి EPF ఖాతాను ప్రాసెస్ చేసి విలీనం చేస్తారు. కాగా, విలీన ప్రక్రియ గురించి తెలుసుకునేందుకు ఈపీఎఫ్‌ఓ అఫీషియల్ పోర్టల్‌ను తనిఖీ చేయండి.